వైసీపీ తోలుబొమ్మ‌లాట‌లో కేతిగాళ్లు, జుట్టుపోలిగాళ్లు

వైఎస్ జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా మంచి జ‌ర‌గాల‌ని ఆకాంక్షిస్తూ, ఆయ‌న కోసం ప‌ని చేసే వాళ్ల‌కు, అస‌లేం జ‌రుగుతున్న‌దో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేదు.

తోలుబొమ్మ‌లాట అనేది ప్రాచీన జాన‌ప‌ద క‌ళా రూపం. స్వ‌తంత్ర పోరాటంలో ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌ర‌చ‌డానికి ఈ క‌ళారూపాన్ని మ‌న పోరాట యోధులు ఆయుధంగా మ‌లుచుకున్నారు. తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు గుర్తుకొస్తారు. ఎందుకంటే, ఈ మూడు పాత్ర‌లు హాస్య ప్ర‌ధాన‌మైన‌వి. జీవితంలో కామెడీది అత్యంత ఆవ‌శ్య‌క‌మైన పాత్ర‌.

న‌వ్వుకోవాలే త‌ప్ప‌, న‌వ్వుల‌పాలు కాకూడ‌దు. క‌వ్వించే పాత్ర‌ల్ని జోక‌ర్ అని ఎగ‌తాళి చేస్తుంటాం. కానీ పేకాట‌లో జోక‌ర్‌కు విశేష ప్రాధాన్యం వుండే సంగ‌తి తెలిసిందే. పేకాట‌లో జోక‌ర్ ప‌డితే, ఆట‌గాడి పంట పండిన‌ట్టే. అలాగ‌ని జీవిత‌మ‌నే ఆట‌లో జోక‌ర్ పాత్ర పోషించాల‌ని ఎవ‌రూ కోరుకోరు.

మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో కామెడీ పీస్‌గా మార‌కూడ‌దు. అలా మారితే ఏమ‌వుతుందో, ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ స‌జీవ సాక్ష్యం. వైసీపీ తోలుబొమ్మ‌లాట‌లో కేతిగాళ్లు, జుట్టుపోలిగాళ్లున్నార‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. అందుకే వైసీపీ ఘోర ప‌రాజ‌యంతో న‌వ్వుల‌పాలైంద‌ని సొంత పార్టీకి చెందిన యాక్టివిస్టులే దెప్పి పొడుస్తున్నారు.

వైసీపీ సోష‌ల్ మీడియాలో విచిత్ర ప‌రిస్థితి. ఇందులో రెండు గ్రూపులున్నాయి. ఒక‌టి వైఎస్ జ‌గ‌న్‌, రెండు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి గ్రూపులు. వైఎస్ జ‌గ‌న్ ఎంతో న‌మ్మ‌కంతో స‌జ్జ‌ల‌కు పార్టీ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇది ఎలా వుందంటే… గొర్రె క‌సాయిని న‌మ్మిన‌ట్టుగా అని జ‌గ‌న్ వ‌ర్గంగా చెలామ‌ణి అవుతున్న సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు ఆవేద‌న చెందుతున్నారు. చివ‌రికి జ‌గ‌న్ త‌న‌కంటూ సొంత మ‌నుషులు లేకుండా చేసుకునే దుస్థితికి తెచ్చుకున్నారు.

స‌జ్జ‌ల ఎంచుకున్న వాళ్ల‌కే గ‌తంలో ప్ర‌భుత్వ ప‌ద‌వులు, ఇప్పుడు పార్టీ ప‌ద‌వులు అని జ‌గ‌న్ అభిమానులు నిట్టూర్చుతున్నారు. స‌జ్జ‌ల వ‌ల్లే త‌మ‌కు ప‌ద‌వులు వ‌చ్చాయ‌ని చెప్పేవాళ్ల సంఖ్య త‌క్కువేమీ లేదు. అందుకే 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మికి స‌జ్జ‌లే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌ల్ని ఆయ‌న వ‌ర్గం అంగీక‌రించ‌డం లేదు. స‌జ్జ‌ల అంటే స‌జ్జ‌నుడు అని, జ‌గ‌న్ లోప‌భూయిష్ట ప‌రిపాల‌నా విధానాలే వైసీపీ కొంప ముంచాయ‌ని వెన‌కేసుకు రావ‌డం గ‌మ‌నార్హం.

అందుకే కొంద‌రు యూట్యూబ‌ర్లను బ‌తిమ‌లాడి స‌జ్జ‌ల‌కు అనుకూలంగా వీడియోలు చేయించుకుంటున్నార‌ని జ‌గ‌న్ అభిమానులు అంటున్నారు. స‌జ్జ‌ల‌, అలాగే తిరుప‌తి జిల్లాలో ఇంట గెల‌వ‌లేక‌, ఒంగోలుకు వెళ్లిన ఓ నాయ‌కుడు క‌లిసి … వైసీపీలో వాస్త‌వాల్ని వెలికి తీసే వాళ్ల‌కు జ‌గ‌న్ ద‌గ్గ‌రుండే పుడింగి అనే ఓ కేతిగాడితో లీగ‌ల్ నోటీసులు పంపిస్తున్నార‌ని తెలిసింది. అయితే పిల్లి పాలు తాగుతూ త‌న‌కేమీ తెలియ‌ద‌ని అనుకున్న చందంగా… తోలుబొమ్మ‌లాట‌లోని జుట్టుపోలిగాళ్లు, కేతిగాళ్లు నాట‌కాలాడుతున్నార‌ని జ‌గ‌న్‌ను అభిమానించే నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు.

జ‌గ‌న్ నీడ‌లా వుంటూ, ఆయ‌న పేరు చెప్పుకుని ఆర్థికంగా భారీగా ల‌బ్ధిపొందిన జుట్టుపోలిగాళ్లు, కేతిగాళ్లు… నిత్యం త‌మ నాయ‌కుడు, ఆయ‌న భార్య‌పై తీవ్ర అభ్యంత‌ర‌క‌ర క‌థ‌నాలు రాస్తూ, డిబేట్లు నిర్వ‌హించే వాళ్ల‌కు ఒక్క‌టంటే ఒక్క లీగ‌ల్ నోటీసైనా పంపారా? అని జ‌గ‌న్ వ‌ర్గ నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. వైసీపీ తోలుబొమ్మ‌లాట‌లోని జుట్టుపోలిగాళ్లు, కేతిగాళ్ల వ్య‌వ‌హారాలు చూస్తుంటే, త‌మ‌కు మాత్ర‌మే ప‌రువుప్ర‌తిష్ట‌లు ఉన్నాయ‌ని, జ‌గ‌న్‌, ఆయ‌న భార్య భార‌తికి లేవ‌న్న సంకేతాలు పంపిన‌ట్టు అవుతోంద‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.

జ‌గ‌న్ ఉప్పు తింటున్నందుకు క‌నీస విశ్వాసం కూడా వీళ్ల‌కు లేద‌ని , త‌మ నాయ‌కుడు గుర్తించే వ‌ర‌కూ వైసీపీకి భ‌విష్య‌త్ లేద‌ని ఆ పార్టీ అనుకూలురు వాపోతున్నారు. పైపెచ్చు ప్ర‌భుత్వంతోనూ, దాని అనుకూల మీడియాతోనూ స‌త్పంబంధాలు పెట్టుకుని, త‌మ జోలికి రాకుండా …జ‌గ‌న్‌ను, ఆయ‌న కుటుంబాన్ని ఏం చేసినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని త‌మ చ‌ర్య‌ల ద్వారా సంకేతాలు పంపార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుమారుడు భార్గ‌వ్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే బాగుంటుంద‌ని వైసీపీ శ్రేణులు ఆకాంక్షిస్తే, స‌జ్జ‌ల శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని జైలుకు పంపార‌ని జ‌గ‌న్ అభిమానులు తెగ‌బాధ‌ప‌డుతున్నారంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది.

వైఎస్ జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా మంచి జ‌ర‌గాల‌ని ఆకాంక్షిస్తూ, ఆయ‌న కోసం ప‌ని చేసే వాళ్ల‌కు, అస‌లేం జ‌రుగుతున్న‌దో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేదు. జ‌గ‌న్‌కు శ‌త్రువులు మ‌రెక్క‌డో లేర‌ని, ఆయ‌న నీడ‌లా వెన్నంటి వుండేవాళ్ల‌తోనే అనే అనుమానం బ‌లంగా వుంది. అయితే వాళ్ల‌ను ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో, చుట్టూ ఉన్నోళ్ల‌ను మ‌న‌సులోనూ, సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై తిట్టుకుంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు.

24 Replies to “వైసీపీ తోలుబొమ్మ‌లాట‌లో కేతిగాళ్లు, జుట్టుపోలిగాళ్లు”

  1. అంటే మా అన్నని తోలుబొమ్మ అని అంటున్నావా …. నీకు బాగా మదమెక్కింది రా గోవర్ధన…

    1. పాపం జుట్టుపోలిగల్లు లీగల్ నోటీసు పంపించారు అనుకుంట…గింజుకుంటూ ఆర్టికల్ రాశాడు

  2. ఇండియా కు పాకిస్థాన్ ఎలాగో….జగన్ కు సజ్జల అలా అన్న మాట

  3. అసలు వీడికి మంచి జరగాలి అని కోరుకునేది ఎవర్రా ఎంకి?? స్పైడర్ సైకో గాడు బాగుండాలి అని ఇంకో స్పైడర్ సైకో గాడే కోరుకుంటాడు!! లోక కంఠకుడు వాడు, atleast వాడిని బాగుండాలని కోరుకోకండి రా , వాడు బాగున్నాడు అంటే రాష్ట్రం నాశనం అని అర్థం రా ఎంకి!!

    •  అది వాని పార్టీ వాడి ఇష్టం, మధ్యలో నువ్వు ఎవరు బే GA. ఏమైనా చేసుకుంటాడు లేకుంటే మూసుకుంటాడు..నువ్వు ఏమి ఆశించకుండానే పాకి పని చేస్తున్నావా 14 ఏళ్ళు గా.ఎవ్వరు పతివ్రతలు ఇక్కడ..ఎదవ లావ్.. డా లో సోది నువ్వు ను..అంత బాధ గా ఉంటే టీడీపీ సపోర్టర్ గా మారిపో..
  4. పార్టీ పెట్టి 13 ఏళ్ళు అవుతోంది.. ఇల్లు చక్కదిద్దుకోలేని సన్నాసి.. రాజ్యమేలుతాను అని చెప్పుకుంటుంటే.. నువ్వెలా నమ్మావు..?

    2.0 అంటూ బోర్డు తిప్పేస్తే నమ్మేశావా..?

    మా దృష్టిలో నువ్వే ఒక శుంఠ వి.. అలాంటి నీ దృష్టిలో కూడా జగన్ రెడ్డి ఒక శుంఠ .. ఇక జగన్ రెడ్డి పరిస్థితి ఏమిటో నువ్వే అర్థం చేసుకో..

    1. బారోమీటర్ , థెర్మో మీటర్ లాగా వైసీపీ వాళ్ళ కోసం శుంఠా మీటర్ లాంటిది ఒకటి కనిపెట్టాలి.

  5. మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి, కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, చెత్త నాకొడుకులు అందరూ కల్సి పార్టీని అన్నీ విధాలా మింగినారు కదరా.. చివరికి ఆడి హారతి సిమెంట్ ని కూడా వదల్లేదు కదరా.. మీయమ్మ కడుపులు మాడా 

  6. జై  జై సజ్జలా.. సజ్జల లేకపోతే జెగ్గులు & ప్రభుత్వం big జీరో .. సజ్జల వల్లే ప్రభుత్వం అద్భుతమైనా అభివృద్ధి తో 99% హామీలు అమలు చేసి ప్రతీ ఇంటికీ మేలు చేశారు…  

    పార్టీ బతికి బట్టకట్టాలంటే సజ్జల takeover చెయ్యాలి.

  7. వైసీపీ లో ఉన్న అసలైన కేతిగాడు జుట్టుపోలిగాడు అంటే అది అన్నియ్యే.

    అన్నియ కు విషయం లేదని ప్రజలకు తెలియకూడదు అని, నెపం మొత్తం సజ్జల మీద తోసేయటానికి ప్రయత్నిస్తున్నావు. ప్రజలకు విషయం మొత్తం తెలుసు. నీ పదవికి సజ్జల కొడుకు అడ్డు వచ్చాడని, సజ్జల మీద నీ ఆక్రోశం బయట పెట్టుకుంటున్నావని కూడా అందరికి తెలుసు.

  8. సజ్జల బయటికి వెళ్ళిన రోజున మీ దద్దమ్మ గాడి తెలివి తేటలు బయట పడతాయి, ఆ రోజున మీ దద్దమ్మ గాడు ట్రోల్ అవుతుంటే చూసి ఏడవటం తప్ప చేసేది ఏమీ ఉండదు 

  9. మీరు మీరు కొట్టుకొని చావండి మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి

  10. ఆడేవాడెవరూ, ఆడించేవారెవరు ? అంతా ఆ పైవాడి లీల. ఇంత దానికి ఒక పార్టీ, దానికి ఒక అధ్యక్షుడు అవసరమా? కీలుబొమ్మ పార్టీలో తోలుబొమ్మలు.

Comments are closed.