విలువల‌న్నారే… మ‌రేంటి ఇది?

వైసీపీ త‌ర‌పున ఎన్నికైన స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల్ని చేర్చుకుని విలువ‌ల‌కు పాత‌ర వేయ‌లేకే ఎమ్మెల్సీ బ‌రి నుంచి త‌ప్పుకున్న‌ట్టు టీడీపీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులెవ‌ర్నీ చేర్చుకోవ‌ద్ద‌ని నిబంధ‌న ఏదైనా…

వైసీపీ త‌ర‌పున ఎన్నికైన స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల్ని చేర్చుకుని విలువ‌ల‌కు పాత‌ర వేయ‌లేకే ఎమ్మెల్సీ బ‌రి నుంచి త‌ప్పుకున్న‌ట్టు టీడీపీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులెవ‌ర్నీ చేర్చుకోవ‌ద్ద‌ని నిబంధ‌న ఏదైనా పెట్టుకున్నారేమో అని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేద‌ని తేలిపోయింది.

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా హిందూపురం మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ ఇంద్ర‌జ‌తో పాటు 8 మంది కౌన్సిల‌ర్లు సిటింగ్ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. అలాగే ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల మున్సిప‌ల్ చైర్మ‌న్ చిన్న ఏసోబు, వైస్ చైర్మ‌న్ న‌ర‌సింహ‌రావు టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డితో చ‌ర్చించారు.

ఒక‌ట్రెండు రోజుల్లో వాళ్లిద్ద‌రు కూడా టీడీపీలో చేర‌డం లాంఛ‌న‌మే. ఒక‌వైపు నీతులు వ‌ల్లిస్తూ, మ‌రోవైపు తుంగ‌లో తొక్క‌డం అధికార పార్టీకే చెల్లింద‌ని వైసీపీ విమ‌ర్శిస్తోంది. ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి త‌గినంత బ‌లం లేక‌పోవ‌డం వ‌ల్లే వెన‌క్కి త‌గ్గార‌ని ఇప్పుడీ చేరిక‌ల‌తో అర్థ‌మ‌వుతోంద‌ని వైసీపీ చెబుతోంది.

విశాఖ జిల్లాలో టీడీపీ ప్ర‌లోభాల‌కు ప్ర‌య‌త్నించింద‌ని, అయితే గెల‌వ‌డానికి కావాల్సినంత‌మంది వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని అర్థ‌మ‌య్యే వెన‌క్కి త‌గ్గి, విలువ‌ల కోసం త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌చారం చేసుకుంద‌ని వైసీపీ నేత‌లు దెప్పి పొడుస్తున్నారు. త‌మ‌కు అనుకూలంగా జ‌రిగితే గొప్ప‌గా ప్ర‌చారం చేసుకోవ‌డం, లేదంటే ఏదో ఒక సాకు చెప్పి త‌ప్పుకోవ‌డం టీడీపీకి అల‌వాటే అని వైసీపీ విమ‌ర్శిస్తోంది. వైసీపీ త‌ర‌పున ఎన్నికైన కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్ల‌ను చేర్చుకుంటూ, ఎలాంటి సంకేతాలు పంపాల‌ని అనుకుంటున్నారో చెప్పాల‌ని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

5 Replies to “విలువల‌న్నారే… మ‌రేంటి ఇది?”

    1. పదవికి రాజీనామా చేశాకే పార్టీలోకి తీసుకుంటామని చెప్పిన అన్నయ్య పదవికి రాజీనామా చేయకుండానే ఐదుగురును తీసుకున్నాడు అదే విలువలు,విశ్వసనీయత అంటే..

Comments are closed.