టీటీడీ నిధులు – బాబు స‌ర్కార్ ఆదేశాల‌పై విస్మ‌యం!

శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యం కోసం తిరుప‌తి న‌గ‌రంలో టీటీడీ నిధుల‌తో రోడ్లు నిర్మిస్తే గ‌గ్గోలు పెట్టి, దీనిపై విజిలెన్స్ విచారణ పేరుతో దేవ‌స్థానం ఇంజినీర్ల‌కు నోటీసులు జారీ చేసి వేధిస్తున్న తెలుగుదేశం ప్ర‌భుత్వం…తాజాగా టీటీడీ…

శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యం కోసం తిరుప‌తి న‌గ‌రంలో టీటీడీ నిధుల‌తో రోడ్లు నిర్మిస్తే గ‌గ్గోలు పెట్టి, దీనిపై విజిలెన్స్ విచారణ పేరుతో దేవ‌స్థానం ఇంజినీర్ల‌కు నోటీసులు జారీ చేసి వేధిస్తున్న తెలుగుదేశం ప్ర‌భుత్వం…తాజాగా టీటీడీ నిధుల‌తో చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గంలో ర‌హ‌దారుల నిర్మాణం కోసం ఈవోకు ఆదేశాలు జారీ చేయడం విస్మ‌యం క‌లిగిస్తోంది.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక న‌గ‌ర‌మైన తిరుప‌తిలో శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యం కోసం…అప్ప‌టి టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స‌హ‌కారంతో 18 మాస్ట‌ర్ ప్లాన్ రోడ్లు నిర్మించారు. ఇందుకు మున్సిపాలిటీ నిధుల‌తో పాటు టీటీడీ నిధుల‌నూ కేటాయించారు. దీనిపై అప్ప‌డు ప్ర‌తిప‌క్షంలో వున్న తెలుగుదేశం పార్టీ తీవ్ర రాద్ధాంతం చేసింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌పై నిత్యం వ్య‌తిరేక వార్త‌లు వండి వార్చింది.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే టీటీడీ ప్ర‌క్షాళ‌న పేరుతో 40 మంది విజిలెన్స్ అధికారుల బృందం తిరుమ‌ల‌, తిరుప‌తిలో తిష్ట‌వేసి ఫైళ్ల‌న్నీ త‌వ్వితీశారు. ఆపై 75 మంది ఇంజినీర్ల‌కు నోటీసులు జారీ చేశారు. మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌తో పాటు ప‌లు ఇంజినీరింగ్ ప‌నుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌డుతూనే ఈ నోటీసులు జారీ చేశారు.

నోటీసులు అందుకున్న ఇంజినీర్లు ఇంకా వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌క ముందే.. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి టీటీడీ ఈవోకు ఓ ఆదేశం జారీ అయింది. చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గంలోని ప‌లు ర‌హ‌దారుల‌ను టీటీడీ నిధుల‌తో నిర్మించాల‌న్న‌ది ఆ ఆదేశాల సారాంశం.

ఆ మ‌ధ్య వ‌ర‌ద‌ల‌కు తిరుప‌తి -చిగురువాడ మార్గం, తిరుప‌తి -త‌న‌ప‌ల్లి రోడ్డు, తిరుచానూరు- పూడి రోడ్డు, రంగంపేట- ఐతేప‌ల్లి ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయ‌ని, వీటిని టీటీడీ నిధుల‌తో పున‌ర్ నిర్మించాలని కోరుతూ చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడికి లేఖ రాశారు. దీనిపైన స్పందించిన ప్ర‌భుత్వం.. పులివ‌ర్తి సూచించిన రోడ్ల నిర్మాణ బాధ్య‌త‌ల‌ను టీటీడీ చేప‌ట్టాల‌ని ఆదేశిస్తూ ఈవోకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో నిన్న‌నే నోటీసులు అందుకున్న టీటీడీ ఇంజినీర్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఏ కార‌ణాలు చూపుతూ త‌మ‌కు నోటీసులు జారీ చేశారో.. ఆదే ప‌ని చేయ‌మంటూ ఇప్పుడు త‌మ‌కు ఆదేశాలు ఇస్తే ఎలా చేయ‌గ‌ల‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో టీటీడీ ఈవో ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్త‌కిగా మారింది. అదే విధంగా వైసీపీ ప్ర‌భుత్వంలో చేసింది త‌ప్ప‌ని వాదించిన తెలుగుదేశం.. ఇప్పుడు త‌మ నిర్ణ‌యాన్ని ఎలా స‌మ‌ర్ధించుకుంటుందో చెప్పాల‌ని తిరుప‌తి వాసులు ప్ర‌శ్నిస్తున్నారు.

9 Replies to “టీటీడీ నిధులు – బాబు స‌ర్కార్ ఆదేశాల‌పై విస్మ‌యం!”

  1. ఒక ప్రూఫ్ రీడర్ ని పెట్టుకోడానికి సీన్ లేని GA కి తిరుపతి వాసులు ప్రశ్నిస్తున్నారు అని తెలిసిపోయే జర్నలిస్టుల నెట్వర్క్ ఉంది మరి .. అయ్యా నమ్మండి ..

  2. అవును ఇంతకుముందు తప్పు పట్టడం నిజం అయితే ఇది అంతకంటే తప్పు, తిరుపతి తో ఏమాత్రం సంభందం లేని చంద్రగిరి లో టీటీడీ నిధులతో రోడ్లు నిర్మించడం ఏమిటి?

Comments are closed.