నా మాట‌ల‌కు మ‌న‌స్తాపం క‌లిగితే….!

సాధార‌ణ వ్య‌క్తులు య‌థాలాపంగా ఏదైనా మాట్లాడితే పెద్ద స‌మ‌స్య వుండ‌దు. కానీ రాజ‌కీయంగా ప్ర‌ముఖ స్థానాల్లో వున్న వాళ్లు ఒళ్లుద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల్సి వుంటుంది. నోరు జారితే తిరిగి తీసుకోవ‌డం క‌ష్టం. ఒక‌వేళ త‌ప్పును…

సాధార‌ణ వ్య‌క్తులు య‌థాలాపంగా ఏదైనా మాట్లాడితే పెద్ద స‌మ‌స్య వుండ‌దు. కానీ రాజ‌కీయంగా ప్ర‌ముఖ స్థానాల్లో వున్న వాళ్లు ఒళ్లుద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల్సి వుంటుంది. నోరు జారితే తిరిగి తీసుకోవ‌డం క‌ష్టం. ఒక‌వేళ త‌ప్పును తెలుసుకుని, దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టినా, ఆ లోపే ప్ర‌త్య‌ర్థులు రాజ‌కీయంగా సొమ్ము చేసుకోడానికి ప్ర‌య‌త్నిస్తారు.

ఈ నేప‌థ్యంలో అలాంటి అనుభ‌వ‌మే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎదురైంది. దీంతో ఆయ‌న వెంట‌నే అప్ర‌మ‌త్తమ‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న విచారం వ్య‌క్తం చేయ‌డం విశేషం. అస‌లేం జ‌రిగిందంటే… గురువారం కేటీఆర్ ఒక స‌మావేశంలో మాట్లాడుతూ మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణంపై వ్యంగ్యంగా అన్నారు.

“బ‌స్సుల్లో ఎల్లిపాయ‌ల పొట్టు తీసుకోవ‌డం కాక‌పోతే కుట్లు, అల్లిక‌లు కూడా పెట్టుకోండి. ఒక్కొక్క‌రికీ ఒక్కో బ‌స్సు పెట్టి బ్రేక్ డ్యాన్స్‌లు కూడా వేసుకోండి” అని వెట‌క‌రించారు. కేటీఆర్ కామెంట్స్‌పై కాంగ్రెస్ నిర‌స‌న‌కు పిలుపునిచ్చింది. దీంతో కేటీఆర్ ఓ పోస్టును షేర్ చేశారు.

“నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు”

కేటీఆర్ పోస్టుతో మ‌హిళ‌ల్లో ఆగ్ర‌హాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. త‌న మాట‌ల్లో త‌ప్పు దొర్లింద‌ని కేటీఆర్ గ్ర‌హించ‌డం వ‌ల్లే వెంట‌నే ఆయ‌న దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాంగ్రెస్ రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూసింది.

9 Replies to “నా మాట‌ల‌కు మ‌న‌స్తాపం క‌లిగితే….!”

  1. ఇతని మాటల మీద మహిళా కమిషన్ సుమోటో గా కే*సు స్వీకరించింది అట! 365×24 గంటలు కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ లని దుర్వినియోగం చేస్తుందని కింద పడి దొర్లి ఏడ్చే ఆంధ్రజ్యోతి బాధాకృష్ణ దానికేమంటాడు?

  2. ఈ ముక్కు దొర అబ్బా కొడుకులకి, ప్యాలస్ పులకేశి గాడికి మామూలు జనాలు అంటే లెక్క లేదు,

    ఎందొ, వీళ్ళు చక్రవర్తి లా గా ఫీల్ అవుతారు. అందుకే జనాలు గూటం దించారు , బిర్రుగా.

Comments are closed.