పవన్ సినిమాల్లోకి వచ్చే టైమ్ వచ్చిందా?

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టే సమయం వచ్చింది. ఈ మేరకు సంకేతాలు కనిపిస్తున్నాయి. Advertisement పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు సెట్స్…

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టే సమయం వచ్చింది. ఈ మేరకు సంకేతాలు కనిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ సెట్ లో ఈ సినిమాకు సంబంధించి ఓ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సెట్స్ లో త్వరలోనే పవన్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

ఎన్నికల ప్రచారం మొదలైనప్పట్నుంచి పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు పవన్. ఆయన చేయాల్సిన ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలా ఆగిపోయిన సినిమాలు ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు హరిహర వీరమల్లు సెట్స్ పైకి వచ్చిందంటే, పవన్ కచ్చితంగా ఆ సినిమా యూనిట్ కు హామీ ఇచ్చి ఉంటారు. ఇది అభిమానులకు ఆనందాన్నిచ్చే వార్తే.

పవన్ ఒక్కసారి ఇటువైపు వచ్చారంటే, ఇక ఆగరు. దాదాపు ఆయన సినిమాలన్నీ సెట్స్ పైకి వచ్చేస్తాయి. ఎన్నికలకు ముందు ఆయన అదే చేశారు. ఇప్పుడు కూడా సమాంతరంగా సినిమాల్ని పూర్తిచేస్తారు. అయితే పవన్ నుంచి ముందుగా ఓజీ వస్తుందా, హరిహర వీరమల్లు పార్ట్-1 వస్తుందా అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది.

దర్శకుడు జ్యోతి కృష్ణ, హరిహర వీరమల్లు మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ పర్యవేక్షణలో పూర్తి చేస్తున్నాడు. పవన్ ను డైరక్ట్ చేయడం కోసం అతడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.

2 Replies to “పవన్ సినిమాల్లోకి వచ్చే టైమ్ వచ్చిందా?”

Comments are closed.