మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలైంది. కొత్త అమ్మాయి అందాల ఆరబోత కన్నా కూడా జనాల దృష్టిని ఆకర్షించిన విషయం మరోకటి వుంది. సినిమాలో కమెడియన్ ప్రభాస్ చేసిన గురూజీ పాత్ర. సినిమాలో హీరో కావాలనుకునే కమెడియన్ (చమ్మక్ చంద్ర), అతగాడిని మంచి హీరోని చేస్తా అంటూ పక్కనే కూడా వుండే ‘గురూజీ’ అని పిలిపించుకునే మరో కమెడియన్ (ప్రభాస్ శ్రీను). ఈ గురూజీ.. గురూజీ అంటూ పిలుపు, సదరు గురూజీ మాటలు ఇవన్నీ కలిసి బచ్చన్ సినిమాలో సదరు పాత్ర దర్శకుడు త్రివిక్రమ్ ను టార్గెట్ చేసినట్లు వుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు.
దర్శకుడు హరీష్ ఇలా ఎందుకు చేసి వుంటారు అనే డిస్కషన్ టాలీవుడ్ లో వినిపించడం ప్రారంభమైంది. నిజానికి పీపుల్స్ మీడియా సంస్థకు దర్శకుడు త్రివిక్రమ్ తో మంచి సంబంధాలు వున్నాయి. త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ తో కూడా మంచి అనుబంధం వుంది. బ్రో సినిమాను సెట్ చేసింది త్రివిక్రమ్ నే. అందువల్ల పీపుల్స్ మీడియా సంస్థ ఇలాంటి పనికి ప్రోత్సహించదు. కానీ పవన్ తో సినిమా చేస్తూ, పవన్ కు గురువు లాంటి వ్యక్తి అని తెలిసి కూడా త్రివిక్రమ్ ను గుర్తు చేసేలాంటి పాత్ర ను దర్శకుడు హరీష్ ఎందుకు పెట్టినట్లు?
అబ్బే.. అంతా ఊహాగానం.. అసలు.. త్రివిక్రమ్ ను టార్గెట్ చేయలేదు అని దర్శకుడు అంటారు అనుకుందాం. కానీ గురూజీ.. గురూజీ అని పదే పదే ఎందుకు అనిపించడం? టాలీవుడ్ లో గురూజీ అని పిలిపించుకునే దర్శకుడు ఒక్క త్రివిక్రమ్ మాత్రమే అని అందరికీ తెలుసు కదా. ఇలాంటి అనుమానాలు వస్తాయని తెలియదా? ఉస్తాద్ సినిమా వెనక్కి.. వెనక్కి వెళ్లడం వెనుక త్రివిక్రమ్ వున్నారనే రూమర్లు వున్నాయి. అందుకే ఇలాంటి పాత్రను పెట్టారా? అన్న డిస్కషన్లు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
నిజానికి ప్రీమియర్ షో ల టైమ్ లోనే సినిమాకు వెళ్లిన ఇండస్ట్రీ జనాలు ఈ పాయింట్ మీదే కాస్సేపు మాట్లాడుకున్నారు. అసలు త్రివిక్రమ్ మీద హరీష్ కు ఎందుకు కోపం అని చర్చించుకున్నారు.
నిజానికి ఈ ట్రాక్ కూడా కాపీ కొట్టిన ట్రాక్. దర్శకుడి స్వంత కవిత్యం కాదు. గతంలో ఓ సినిమాలో కమెడియన్ అలీ చేసిన పాత్ర ట్రాక్ ను ఇక్కడ ఫ్రీ గా వాడేసారు. అక్కడ కోటా కొడుకు అలీ.. ఇక్కడ జగపతిబాబు కొడుకు చమ్కక్ చంద్ర. మిగతాదంతా సేమ్ టు సేమ్.
Vc estanu 9380537747
Vc available 9380537747
ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా “శుభ లగ్నం”
Call boy jobs available 8341510897
శారద పీఠం మీద సెటైర్ ఏమో, నీ కవర్ డ్రైవ్ చుస్తే ఇదే నిజం అనిపిస్తుంది.
జనం పట్టించుకోరు