Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

చిరు: మొహమాటానికి పోతే..

చిరు: మొహమాటానికి పోతే..

మొహమాటానికి పోతే మొదటికే మోసం వస్తుందని సామెత. ఈ సామెత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విషయంలో అచ్చు గుద్దినట్లుగా సరిపోయేలా ఉంది. ఆయనలోని మొహమాటానికి పోయే లక్షణాన్ని అడ్డగోలుగా వాడుకుంటూ తెలుగుదేశం పార్టీ మిత్రులైన పార్టీలు లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి ఇంతకు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీ హోదా అనుభవించి, కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు చిరంజీవి. మరి ఆ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారా? చేయకపోతే ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నట్లు కదా లెక్క.. అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహాలు. ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులూ కూడా అదే చెబుతున్నారు. తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చిరంజీవి ఇంకా రాజీనామా చేయలేదని అంటున్నారు. 

అయితే తాజాగా చిరంజీవి తెలుగుదేశం అనుకూల నాయకుడు.. అని ముద్ర వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల కిందట చిరంజీవి ఉన్న షూటింగ్ లోకేషన్ కు వెళ్లి ఆశీర్వాదం కోరిన పవన్ కళ్యాణ్ కు మెగాస్టార్ 5 కోట్ల రూపాయలు విరాళం చెక్కు అందించారు. అదేదో తన తమ్ముడి మీద ప్రేమతో ఆయన పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడుతుందని ఇచ్చి ఉంటాడని అనుకోవచ్చు. దాని గురించి పెద్ద సీరియస్ ఎవరూ పట్టించుకోలేదు. 

అయితే ఇప్పుడు అనకాపల్లి ఎంపీ సీటుకు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబులకు అనుకూలంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. వీరిద్దరికీ ఓట్లు వేసి గెలిపించాలంటే ఆయన తన అభిమానులకు ఇచ్చారు. 

చూడబోతే ముందు ముందు తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు అనుకూలంగా రాష్ట్రాన్ని చిరంజీవి నుంచి ఇలాంటి వీడియో సందేశాలు అనేకం వస్తాయని అర్థం అవుతుంది. ఆయన మొహమటాన్ని వివిధ పార్టీల నాయకుడు అడ్డగోలుగా వాడుకుంటున్నారు. కానీ ఈ వైఖరి వలన ముందు ముందు చిరంజీవికే నష్టం వాటిల్లుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?