Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

తెల్ల కాగితాలపై సంతకం: అంత అమాయకుడా?

తెల్ల కాగితాలపై సంతకం: అంత అమాయకుడా?

జగన్ మీద రాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీష్ ను ప్రోత్సహించినాడనే అనుమానంతో పోలీసులు తొలుత అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టిన వేముల దుర్గారావు మరీ అంత అమాయకుడా? నోట్లో వేలు పెడితే కొరకలేనంత వెర్రివాడా? అవసరమైతే విచారణకు మళ్లీ పిలుస్తాం అని చెప్పి పంపినంత మాత్రాన, నేరంతో అతడికి సంబంధం లేదని తేలిపోయినట్లు కాదు.

కానీ.. దుర్గారావు బయటకు వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్న మాటలు, కలుస్తున్న వ్యక్తులు, వ్యవహరిస్తున్న తీరు అంతా కూడా రాజకీయంగా అతి జాగ్రత్త తీసుకుంటున్నట్టుగానే ఉన్నాయి. వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. నిజానికి రాయివిసిరిన వ్యక్తిగా పోలీసులు అరెస్టు చేసిన వేముల సతీష్ రిమాండు రిపోర్టులో దుర్గారావు పేరులేదు. కానీ, ప్రోత్సహించిన వ్యక్తిగా ఏ2 లో పేరులేకుండా సూచించారు. అది దుర్గారావే అని ప్రచారం జరిగింది.

మొత్తానికి దుర్గారావును విడిచిపెట్టారు. ఆయన ఆరోజు మీడియాతో మాట్లాడుతూ.. నీ వెనక ఎవరున్నారో చెప్పమని పోలీసులు గట్టిగా అడిగారని, అసలు నేరంతోనే తనకు సంబంధం లేనప్పుడు, వెనక ఎవరో ఉండడం ఏమిటి? అని తాను గట్టిగా ప్రశ్నించడంతో విడిచిపెట్టారని అన్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తనను పోలీసులు కొట్టారని కొత్త సంగతి జత కలిపారు. అంతే కాదు.. తనతో పోలీసులు తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారని, ఆ కాగితాల మీద ఏం రాసుకుని, తనను ఇరికిస్తారో అనే భయం ఉన్నదని దుర్గారావు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన దుర్గారావు.. పోలీసులు పిలిచి తెల్లకాగితాల మీద సంతకం చేయమంటే.. చేసేంతటి అమాయకుడా అనే సందేహం పలువురికి కలుగుతోంది.

దుర్గారావు నిజానికి తన తెలివితేటల గురించి చాలా గొప్పలు చెప్పుకున్నాడు. నువ్వే రాయి వేయించావంట కదా అని గద్దించి అడిగినా కూడా భయపడకుండా ఎదురు నిలిచానని, రుజువులు చూపించమని నిలదీశానని ఇలా చాలా చెప్పుకున్నాడు. బెదిరించినా సరే నేరాన్ని అంగీకరించేది లేదని చెప్పినట్టుగా కూడా అన్నాడు.

ఇన్ని తెలివితేటలు ఉన్న తెలుగుదేశం నాయకుడు.. నిన్ను వదిలేస్తున్నాం అని చెప్పి కొన్ని తెల్ల కాగితాల మీద సంతకం పెట్టమని అడగగానే పెట్టేసినట్టు చెబుతన్నాడు. పోలీసులు ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని తనది కాదని బుకాయించడానికి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా తెల్లకాగితాల పాట పాడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?