Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

జనసేన నుంచి పోటీ చేసిన కీలక నేత వైసీపీలోకి !

జనసేన నుంచి పోటీ చేసిన కీలక నేత వైసీపీలోకి !

విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆదివారం బ్రహ్మాండమైన వాతావరణంలో మొదలైంది. జగన్ పట్ల విశాఖ ప్రజలలో ఉన్న అభిమానం ఆయన తలపెట్టిన రోడ్ షో సందర్భంగా బయటపడింది. జాతీయ రహదారికి దారికి ఇరువైపులా జనసందోహం కనిపించింది. ఫ్లై ఓవర్లు జనాలతో కిటకిటలాడాయి.

జగన్ విశాఖ పర్యటన సందర్భంగా టీడీపీ జనసేనల నుంచి ముఖ్య నాయకులు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో విశాఖ సౌత్ అసెంబ్లీ సీటు నుంచి జనసేన తరఫున పోటీ చేసిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కీలక నేత గొంపల గిరిధర్ వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

గంపల గోవర్ధన్ 2019లో జనసేన తరఫున పోటీ చేస్తే 18 వేలకు పైగా ఓట్లు లభించాయి. ఆయన బలమైన నాయకుడిగా ఉంటూ జనసేనలో ఇమడలేక వైసీపీలోకి వచ్చారు.  ఆయన కంటే ముందు మరో మత్స్యకార కీలక నేత మూగి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. విశాఖ సౌత్ లో ఆ సామాజికవర్గం జనాభా ఎక్కువ. దాంతో జనసేన అక్కడ నుంచి పోటీ పడుతున్న సందర్భంలో ముఖ్య నేతలు వైసీపీ వైపు రావడం, వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకార నాయకుడు కావడంతో ఫ్యాన్ పార్టీకి అనుకూలంగా విశాఖ సౌత్ మారుతోంది అని అంటున్నారు.

భీమిలీలో చూస్తే జనసేన కీలక నేతలు కొందరు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన పెట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో పనిచేస్తూ వచ్చిన విద్యా వేత్త అలీవర్ రాజు వైసీపీలో చేరారు. అలాగే జనసేన సీనియర్ నేత ఎన్.శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరారు.

కీలక నేతలు అంతా వైసీపీలోకి రావడంతో భీమిలీ విశాఖ సౌత్ వంటి సీట్లలో వైసీపీకి మరింత సానుకూల వాతావరణం ఏర్పడింది అని అంటున్నారు. జనసేన పుట్టిన దగ్గర నుంచి ఉన్న వారు కూడా ఈ వైపు రావడం పట్ల చర్చ సాగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?