
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ సూచనకు వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నొచ్చుకున్నారు. ఇవాళ 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడాల్సిందిగా స్పీకర్ తమ్మినేని చిత్తూరు జిల్లా పీలేరు వైసీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని కోరారు. దీంతో ఆయన మాట్లాడ్డానికి ఉపక్రమించారు. వెంటనే స్పీకర్ ప్రశ్న సూటిగా వేయాలని సూచించారు. స్పీకర్ ఏం చెబుతున్నారో పీలేరు ఎమ్మెల్యేకు అర్థం కాలేదు.
స్పీకర్ జోక్యం చేసుకుంటే నేరుగా ప్రశ్న మాత్రమే అడగాలని స్పష్టం చేశారు. తాను మైక్ తీసుకోగానే మీ చేయి బెల్ మీదకు పోతోందని, దీంతో ప్రశ్న అడగాలన్న ఉత్సాహం నీరుగారిపోతోందంటూ చింతల వాపోయారు. ఇదే విషయాన్ని చింతల రెండుసార్లు అనడం చూస్తే... ఆయన నొచ్చుకున్నట్టే కనిపించింది. దయచేసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చింతల కోరారు.
తన సూచనకు చింతల రామచంద్రారెడ్డి నొచ్చుకున్నారని స్పీకర్ గ్రహించారు. అందుకే ఆయనేమీ మాట్లాడలేదు. ఈబీసీ నేస్తానికి సంబంధించి చింతల రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే, లబ్ధిదారుల ఇబ్బందులను సభ దృష్టికి తీసుకొచ్చారు.
చింతల ప్రశ్నకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. చింతల మాట్లాడిన తర్వాత ఆయన వైపు స్పీకర్ తమ్మినేని చూస్తూ నవ్వడం విశేషం. గురువారం ఉదయాన్నే సభ ప్రారంభం కాగానే ఈ దృశ్యం అసెంబ్లీలో ఆవిష్కృతమైంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా