Advertisement

Advertisement


Home > Politics - Andhra

బీజేపీకి ఏపీ అంతే .....డౌటేముంది...?

బీజేపీకి ఏపీ అంతే .....డౌటేముంది...?

బీజేపీ పుట్టి నాలుగు దశాబ్దాలు పైనే అయింది. ఏపీలో అద్భుతాలు అయితే ఏనాడూ ఆ పార్టీ సృష్టించలేదు. ఆ పార్టీ తరువాత వచ్చిన పార్టీలు కూడా ముందుకు దూసుకువచ్చేశాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి అంటే మేమే 2024లో అని ఆ పార్టీ వారు అనవచ్చేమో కానీ మిగిలిన పార్టీల వారిని అడిగితే మాత్రం బీజేపీకి ఏపీతో పనేముందనే అంటారు.

ఏపీతో బీజేపీకి ఏమి పని లేదు అని వైసీపీ విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అసలు విషయమే చెప్పారు. బీజేపీకి ఏపీతో ఏ అవసరం లేదు, బీజేపీ ఏపీ వైపు అందుకే చూడడంలేదు అని ఉన్న మాట చెప్పారు. అందుకే ప్రత్యేక హోదా సహా ఏవీ రావడంలేదని అన్నారు. 

బీజేపీకి ఏపీ మీద ఏమైనా ఆశలు ఉంటే ప్రత్యేక హోదా ఇచ్చేదేమో అని ఆయన అంటున్నారు. బీజేపీకి ఏపీతో సంబంధం లేకుండా మూడు వందలకు పైగా ఎంపీలు ఉన్నారు. అందుకే వైసీపీ ఎంపీలు ఎంత పోరాడుతున్నా ఫలితం కనిపించడంలేదు అని నిజాన్ని చెప్పేశారు.

అయితే కాలం ఎపుడూ ఒకేలా ఉండదని, మంచి పరిణామాలు ముందు ముందు జరిగే అవకాశాలు ఉంటాయని ఆయన అంటున్నారు. వైసీపీ ఎంపీ అన్నారని కాదు కానీ బీజేపీకి ఏపీతో పనేంటి. రాజకీయంగా మూడు ప్రధాన పార్టీలు కమలం చుట్టూనే తిరుగుతున్నాయి. పాతిక ఎంపీ సీట్లూ ఆ విధంగా బీజేపీవే. దేశంలో ఎక్కడా పూర్తి స్థాయి సీట్లు బీజేపీ గెలుచుకోకపోవచ్చేమే కానీ ఏపీలో ఆ బెంగా బెదురూ లేదు. అలా ఏ పార్టీకి లేని విధంగా బీజేపీ రికార్డుని బద్ధలు కొట్టింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?