తీవ్ర ఆరోప‌ణ‌లున్న నేత‌ల‌కు బాబు క్లాస్‌

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చంద్ర‌బాబునాయుడు త‌న పార్టీకి చెందిన నేత‌ల‌కు క్లాస్ పీకుతున్నారు.

గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చంద్ర‌బాబునాయుడు త‌న పార్టీకి చెందిన నేత‌ల‌కు క్లాస్ పీకుతున్నారు. వీళ్ల‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి అధికారంలోకి రావ‌డ‌మే ఆల‌స్య‌మే, దోపిడీకి ఆక‌లిగొన్నట్టుగా చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధులు అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికారం ఉండ‌గానే, ఇంటిని చ‌క్క‌దిద్దుకోవాల‌నే ఉద్దేశంతో నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడవ‌డానికి కూడా వెనుకాడ‌డం లేదు.

ఈ నేత‌ల దోపిడీ శ్రుతిమించింద‌ని నిఘా వ‌ర్గాల ద్వారా చంద్ర‌బాబు తెలుసుకున్నారు. అలాంటి నేత‌ల‌ను ఒక్కొక్క‌రిగా పిలిపించుకుని గ‌ట్టిగా క్లాస్ తీసుకుంటున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. గ‌తంలో వైసీపీ హ‌యాంలోనే మేలు అనుకునేలా నాయ‌కులు ఇష్టానుసారం ఇసుక‌, మ‌ట్టి, అలాగే భూఆక్ర‌మ‌ణ‌లకు పాల్ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

చంద్ర‌బాబు మాత్రం గ‌త ఐదేళ్ల‌లో భ్ర‌ష్టు ప‌ట్టిన వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెడుతున్నానంటున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో అలాంటి వాతావ‌ర‌ణం లేదు. ఓడిపోయిన నేత‌లు, అలాగే గ‌ద్దె దిగిన ప్ర‌భుత్వ‌మే మేలు అనే అభిప్రాయం జ‌నాల్లో క్ర‌మంగా పెరగ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

కొంత మందికి ఎంత చెప్పినా విన‌డం లేద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. చంద్ర‌బాబు క‌న్నెర్ర చేస్తే భ‌య‌ప‌డేవాళ్ల‌ని, ఇప్పుడా ప‌రిస్థితి లేద‌ని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు వాపోతున్నారు. మ‌రీ ముఖ్యంగా మొద‌టిసారి ఎన్నికైన‌, అలాగే వ‌య‌సు రీత్యా ఇక రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన నేత‌ల దోపిడీకి హ‌ద్దూ అదుపూ లేద‌ని స‌మాచారం. అలాంటి నేత‌ల‌కు చంద్ర‌బాబు క్లాస్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ, పెద్ద‌గా మార్పు రావ‌డం లేద‌న్న‌ది నిజం.

3 Replies to “తీవ్ర ఆరోప‌ణ‌లున్న నేత‌ల‌కు బాబు క్లాస్‌”

  1. Baseless alligations కి

    “బ్రాండ్ ambassidors”

    గ్యాస్ ఆంధ్రా and మా A1 ల0గా గాడు

    ఎన్నికల్లో 11 ఇంచులు దింపినా మళ్ళీ అదే FALSE PROPAGNADA నే నమ్ముకుని రాజకీయం చేస్తూ ప్రజలని ఎర్రోళ్లని చెయ్యొచ్చు అనే భ్రమలో ఉన్న A1 and గ్యాస్ ఆంధ్రా..

Comments are closed.