ప‌ద‌వులు అనుభ‌వించిన వైసీపీ మ‌హిళా నేత‌లెక్క‌డ‌?

వైసీపీ హ‌యాంలో కేబినెట్ హోదాల్లోనూ, అలాగే ఓ మోస్తరు నామినేటెడ్ ప‌ద‌వులు అనుభ‌వించిన మ‌హిళా నాయ‌కురాళ్లు అడ్ర‌స్ లేకుండా పోయారు.

వైసీపీ హ‌యాంలో కేబినెట్ హోదాల్లోనూ, అలాగే ఓ మోస్తరు నామినేటెడ్ ప‌ద‌వులు అనుభ‌వించిన మ‌హిళా నాయ‌కురాళ్లు అడ్ర‌స్ లేకుండా పోయారు. చాలా ప‌రిమితమైన నాయ‌కురాళ్లు మాత్ర‌మే వైసీపీ కోసం ప‌ని చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో ఏ హోదా ద‌క్కించుకోని అమాయ‌క సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు అమాయ‌క‌త్వంతో జ‌గ‌న్‌పై అభిమానాన్ని పెంచుకుని, ప్ర‌భుత్వం పోగానే జైలుపాల‌య్యారు.

అలాంటి వాళ్ల‌లో ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌కు చెందిన సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ పెద్దిరెడ్డి సుధారాణి ఒక‌రు. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌పై సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టార‌నే కార‌ణంతో సుధారాణితో పాటు ఆమె భ‌ర్త వెంక‌ట‌రెడ్డిని కూడా గ‌త నెల 4న పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేసులు న‌మోదు చేసి, ముఖ్యంగా సుధారాణిని తిప్పారు. ఎట్ట‌కేల‌కు జైలు జీవితాన్ని అర్థ సెంచ‌రీ పూర్తి చేసుకుని, ఆ దంప‌తులు విడుద‌ల‌య్యారు. ఇప్పుడు వాళ్ల భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కం.

ఇదే వైసీపీ హ‌యాంలో మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వి ద‌క్కించుకుని బుగ్గ‌కార్ల‌లో తిరిగిన వాపిరెడ్డి ప‌ద్మ‌… ప్ర‌భుత్వం దిగిపోగానే తెలివిగా పార్టీని వీడారు. టీడీపీలో చేరేందుకు త‌న‌ను అధికారంలో ఆద‌రించిన జ‌గ‌న్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. వైసీపీలోనే ఉంటున్న మ‌హిళా నేత‌లు వాట్సాప్ డీపీలు, అలాగే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల‌లో జ‌గ‌న్‌తో క‌లిసి న‌డుస్తున్న, లేదా ఆయ‌న‌తో ఆశీస్సులు తీసుకుంటున్న ఫొటోల‌తో ఉండేవారు.

ఎప్పుడైతే అధికారం పోయిందో, ఆ క్ష‌ణం నుంచి దేవుళ్ల ఫొటోలు మాత్ర‌మే వాళ్ల సోష‌ల్ మీడియా వాల్‌పై క‌నిపిస్తున్నాయి. తామింత కాలం ప‌ద‌వులు అనుభ‌వించామ‌ని, వైసీపీ క‌ష్ట‌కాలంలో జ‌గ‌న్‌కు అండ‌గా వుండాల‌నే క‌నీస స్పృహ కూడా లేకుండా పోతోంది. నోరెత్తితే కాదు, జ‌గ‌న్‌తో క‌లిసి ఉన్న ఫొటోతో క‌నిపించినా కూట‌మి ప్ర‌భుత్వంలో ఇబ్బంది అని భ‌య‌ప‌డ్డ మ‌హిళా నేత‌లు… త‌మ‌కు వైసీపీకి, రాజ‌కీయానికి ఏ మాత్రం సంబంధం లేద‌న్న‌ట్టుగా లౌక్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ప‌ద‌వులు అనుభ‌వించ‌ని మ‌హిళా యాక్టివిస్టులు మాత్రం పిల్ల‌ల్ని ఒంట‌రి వాళ్ల‌ని చేసి, జైలు జీవితం గ‌డుపుతున్నారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న వాళ్లెవ‌రో, ప‌రాయివాళ్లెవ‌రో తెలుసుకుని ప్రాధాన్యం ఇస్తే మంచిది. తాను చూసిందే నిజ‌మ‌ని న‌మ్మి, ప‌దేప‌దే మోస‌పోతే చేయ‌గ‌లిగేదేమీ లేద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

8 Replies to “ప‌ద‌వులు అనుభ‌వించిన వైసీపీ మ‌హిళా నేత‌లెక్క‌డ‌?”

  1. తిరుమల దర్శన యాపారం బంద్ చేయిస్తే..

    నగ్రి “నల్ల పిర్రల బర్రె” నిక్కర్లేసుకుని, పైవి ఊపుకుంటూ విదేశీ వీదుల్లో యాపారం మొదలెట్టిందట కదా??

  2. ఆంటే ఆ పెద్దిరెడ్డి సుధారాణి అనే రెడ్లమ్మాయిని ఆదరించి మిగిలినవాళ్ళని దూరంగా ఉంచాలంటావ్

  3. ఎన్నారై విదేశాల నుంచి వస్తే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టాడని ఎయిర్పోర్టులోనే అరెస్టు చేసింది మర్చిపోయావా గ్యాస్ ఆంధ్ర. వారెవ రో సుధా ఆరీష్ చేస్తే నీకు గుద్దలో కాలిందా ఇప్పుడు అప్పుడు వారు చేసింది తప్పు కానప్పుడు ఇపు వీరు చేసింది తప్పేలా అవుతుంది రా గ్యాస్ ఆంధ్ర. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఎంతోమందిని అరెస్టు చేసి బొక్కలో వేశారు అప్పుడు కనపడలేదా. ఇప్పుడు వీరు మాత్రం నీకు కనిపించారా. ఇలాంటి బోడి పోస్టులు పెడుతూ పోతే ఉన్న మర్యాద పోవడం మాత్రం ఖాయం. కోడి కట్టి కేసు గాని ఐదేళ్లు జైల్లోవిచారణ లేకుండా పెడితిరి ఒక కంటికి సున్నము మరో కంటికి వెన్న అంటించడంలో నిన్ను మించిన బోడి గాడు ఈ భూ ప్రపంచంలోభూతద్దం వేసిన దొరకడెమో .

Comments are closed.