గేమ్ ఛేంజర్ కు ఆ సమస్య ఉండదంట?

సంక్రాంతికి వచ్చే గేమ్ ఛేంజర్ సినిమాకు నిరభ్యంతరంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చన్నమాట.

పుష్ప-2 దెబ్బతో తెలంగాణలో ఇక పెద్ద సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఉండవనే ప్రచారం జోరుగా సాగింది. దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కాస్త అస్పష్టంగా ఉన్నప్పటికీ, కోమటరెడ్డి లాంటి మంత్రుల ప్రకటనలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. కేవలం తెలంగాణ ఉద్యమం, సందేశాత్మక చిత్రాలకు మాత్రమే ప్రత్యేక అనుమతులుంటాయని ఆయన విస్పష్టంగా ప్రకటించారు.

దీంతో సంక్రాంతి సినిమాలకు ప్రత్యేక అనుమతులుండవంటూ లెక్కలేనన్ని కథనాలొచ్చాయి. మరీ ముఖ్యంగా గేమ్ ఛేంజర్ కు కష్టమనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇవన్నీ దిల్ రాజు సీన్ లోకి రాకముందు కథనాలు. ఇప్పుడు దిల్ రాజు నేరుగా సీన్ లోకి ఎంటరయ్యారు. సీన్ మొత్తం మార్చేశారు.

చిత్ర సీమ అభివృద్ధికి, సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని దిల్ రాజు ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి బయటకొచ్చిన తర్వాత దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడిన వీడియో క్లిప్ ఒకటి బాగా వైరల్ అయింది.

ఆ వీడియోలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. “మీరు వ్యాపారాలు చేసుకోండి.. సినిమాలు తీసుకోండి.. డబ్బులు చేసుకోండి.. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రత్యేక అనుమతులు తీసుకుండి.. కానీ ప్రాణాలు తీసే ప్రత్యేక పర్మిషన్లు మాత్రం ప్రభుత్వం ఇవ్వదు.” అనే వీడియోను వైరల్ చేస్తున్నారు కొంతమంది.

అంటే దీనర్థం.. ఇండస్ట్రీకి తెలంగాణ సర్కారు సానుకూలమే. పైగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పెద్ద సినిమాలకు ఎలాంటి అభ్యంతరం ఉండదనేది వీటి సారాంశం. దిల్ రాజు రంగంలోకి దిగిన తర్వాత ఈ టాక్ మరింత ఎక్కువైంది.

ఇవన్నీ చూస్తుంటే, సంక్రాంతికి వచ్చే గేమ్ ఛేంజర్ సినిమాకు నిరభ్యంతరంగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చన్నమాట. అదే టైమ్ లో డాకు మహారాజ్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సినిమాలకు కూడా కావాలంటే ప్రత్యేక అనుమతులు ఇవ్వడానికి తెలంగాణ సర్కారు సిద్ధం. ప్రత్యక్షంగా-పరోక్షంగా ఇవన్నీ దిల్ రాజు సినిమాలే కావడం విశేషం.

4 Replies to “గేమ్ ఛేంజర్ కు ఆ సమస్య ఉండదంట?”

  1. రేట్లు పెంచినా పెంచుకున్నా ప్రేక్షకులు ఎంత ఖర్చుపెట్టి చూడాలనుకుంటారో అంతే ఖర్చు పెడతారు…

    అది స్పెషల్ రేట్లు కావొచ్చు, రెండు వారాల తరువాత నార్మల్ రేట్లతో కావొచ్చు, OTTలో కావొచ్చు, TV లో కావొచ్చు

    ఇప్పుడు రేవతి మృతితో ప్రేక్షకులు కూడా ఆలోచనలో పది ఉండొచ్చు, మనం (టిక్కెట్ల రూపంలో) విసిరేసి డబ్బు తో బతికే వాళ్ళ కోసం మనం ప్రాణాలు ఇవ్వాలా అని

  2. ఇప్పుడు రేవతి మృతితో ప్రేక్షకులు కూడా ఆలోచనలో పడి ఉంటారు, మనం (టిక్కెట్ల రూపంలో) విసిరేసి డబ్బు తో బతికే వాళ్ళ కోసం మనం ప్రాణాలు ఇవ్వాలా అని

    అందుకే మనం ఖర్చు చేసే విషయం పునరాలోచించాలి

Comments are closed.