జ‌గ‌న్ రెండుసార్లు చెప్పినా…వైసీపీలో ద‌క్క‌ని ప‌ద‌వి!

స్వ‌యంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పినా ఆయ‌న‌కు పార్టీలోనే రాష్ట్ర ప‌ద‌వి ఇవ్వ‌డానికి తాడేప‌ల్లిలో పార్టీ పెద్ద‌ల‌కు స‌మ‌యం లేదు.

స్వ‌యంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చెప్పినా ఆయ‌న‌కు పార్టీలోనే రాష్ట్ర ప‌ద‌వి ఇవ్వ‌డానికి తాడేప‌ల్లిలో పార్టీ పెద్ద‌ల‌కు స‌మ‌యం లేదు. వైఎస్సార్ జిల్లాలో ఎన్నిక‌ల ముందు టీడీపీ నుంచి వైసీపీలో ఒక ముఖ్య నాయ‌కుడు చేరారు. ఇదిగో అన్న‌కు వైసీపీ రాష్ట్ర స్థాయి ప‌ద‌వి ఇవ్వండ‌ని ఒక‌సారి కాదు, రెండుసార్లు వేర్వేరు సంద‌ర్భాల్లో స్వ‌యంగా జ‌గ‌నే సంబంధిత వ్య‌క్తుల‌కు చెప్పారు.

పాపం ఆ నాయ‌కుడు ప‌ద‌వి వ‌స్తుంద‌ని నెల‌ల త‌ర‌బ‌డి ఎదురు చూస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ ప‌ద‌వి అంద‌ని ద్రాక్షే అయ్యింది. దీంతో స‌ద‌రు నాయ‌కుడికి శ్రేయోభిలాషులు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. “అన్నా, ఇక్క‌డ టీడీపీలో మాదిరిగా వుండ‌దు. టీడీపీలో చంద్ర‌బాబు ఏదైనా చెబితే, వెంట‌నే అమ‌ల‌వుతుంది. కానీ వైసీపీలో దేవుడు వ‌ర‌మిచ్చినా పూజారులు క‌నిక‌రించ‌రు. తాడేప‌ల్లిలో వైసీపీ పెద్ద‌ల ద‌గ్గ‌ర లాబీయింగ్ చేసుకోవాల్సి వుంటుంది” అని చెప్పార‌ట‌!

ఇవ‌న్నీ త‌న వ‌ల్ల కాని ప‌నుల‌ని, ప‌ద‌వి లేక‌పోయినా ఫ‌ర్వాలేదు, జ‌గ‌న్‌పై అభిమానంతో పార్టీ కోసం ప‌నిచేస్తాన‌ని నిర్ణ‌యించుకున్నారాయ‌న‌. ఇలా బ‌య‌టికి తెలిసిన సంగ‌తులు కొన్నే. చింత చ‌చ్చినా పులుపు చావ‌ని చందంగా, రాజ‌కీయంగా వైసీపీ పాతాళానికి ప‌డిపోయినా, ఇంకా ఆ పార్టీలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న‌వాళ్ల‌లో జ్ఞానోద‌యం కాలేద‌న్న ఆరోప‌ణ వెల్లువెత్తుతోంది. స్వ‌యంగా జ‌గ‌న్ ఆదేశించినా దిక్కులేక‌పోతే, ఇక ఎవ‌రు చెబితే ప‌నులు చేస్తారో అర్థం కాని ప‌రిస్థితి.

ఇలాగైతే పార్టీ బాగుప‌డిన‌ట్టే అని కొంద‌రు శ్రేయోభిలాషులు ఆవేద‌న‌తో అంటున్నారు. కాస్త ప్ర‌జ‌ల్లో ప‌లుకుబడి, నోరున్న నాయ‌కుల‌ని ప‌సిగ‌డితే చాలు, ఇక వాళ్ల‌ను బ‌య‌టికి పంపే వ‌ర‌కూ నిద్ర‌పోని నాయ‌కులు వైసీపీలో ఉన్నారు. ఇదే ఆ పార్టీ ప్ర‌త్యేక‌త‌. జ‌గ‌న్ చుట్టూ ఇలాంటి వాళ్లే ఉన్నారు. ఇత‌రుల ఉనికిని ఏ మాత్రం స‌హించ‌లేని నాయ‌కుల్ని పెట్టుకుని, జ‌గ‌న్ ఏం సాధించాల‌ని అనుకుంటున్నారో మ‌రి!

18 Replies to “జ‌గ‌న్ రెండుసార్లు చెప్పినా…వైసీపీలో ద‌క్క‌ని ప‌ద‌వి!”

  1. నేను నిజాయితీ గా రాజకీయం చేసి నాకు కేవలం 11 మంది ఎం ఎల్ ఏ లు , 40 శాతం వోట్ షేర్ మాత్రమే ఉంటే .. అది చాలు అసెంబ్లీ లో అధికారపక్షాన్ని ఎదిరించడానికి . పది నిమిషాలు మైక్ ఇచ్చినా మాటలు తూటాలు గా ఉంటాయి. ఒప్పొసిషన్ లో ఎవడున్నా తగ్గేదే లే . ప్రభుత్వం తో పనిచేయిస్తా , ప్రజలకి దగ్గరగా ఉంటా.

  2. వాడు waste గాడు అనే కదా మేము చెప్పేది, పార్టీ లో కానీ ఇంట్లో కానీ ప్రజల్లో కానీ రెస్పెక్ట్ లేనిది whole world వీడే!!

  3. సొంత పెళ్ళాం మే, తన మాట వినని వాడికి, వూళ్లో కూడా గౌరవం వుండదు అని కడప లు అంటారు.

    ఇప్పుడు ఇక్కడ రాశారు.

Comments are closed.