తుడా చైర్మ‌న్ ప‌ద‌వికి భారీ డిమాండ్‌

తుడా చైర్మ‌న్ ప‌ద‌విని వేలానికి పెట్టార‌ని, ఎక్కువ‌కు ఎవ‌రు పాడుకుంటే వాళ్ల‌కే ద‌క్కుతుంద‌ని అన్ని పార్టీల నాయకులు అంటున్న మాట‌.

ఈ నెలాఖ‌రుకు నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌తో ఆశావ‌హులు అప్ర‌మ‌త్తం అయ్యారు. ప‌ద‌వి రావాలంటే ఏం చేయాలో ఎవ‌రెవ‌రిని ప్ర‌స‌న్నం చేసుకోవాలో ఆరా తీస్తున్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మంత్రుల ద‌గ్గ‌రికి నాయ‌కులు ప‌రుగులు పెడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (తుడా) చైర్మ‌న్ ప‌ద‌వికి భారీ డిమాండ్ వుంది. జ‌నసేన‌, టీడీపీ నాయ‌కుల నుంచి ఈ ప‌ద‌వికి విప‌రీత‌మైన పోటీ నెల‌కుంది. దివంగ‌త మాజీ ఎంపీ ఆదికేశ‌వుల‌నాయుడు మ‌న‌వ‌రాలు చైత‌న్య త‌న‌కే సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ హామీ ఇచ్చార‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. నిజానికి గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లోనే త‌న‌కు ప‌ద‌వి ఇస్తార‌ని ఆమె ఆశాభావంతో ఉన్నారు. కానీ కుద‌ర్లేదు.

మ‌రోవైపు తుడా చైర్మ‌న్ ప‌ద‌వి త‌న‌కు ఇస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందే నారా లోకేశ్ హామీ ఇచ్చిన‌ట్టు డాల‌ర్స్ దివాక‌ర్‌రెడ్డి చెబుతున్నారు. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఈయ‌న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి పులివ‌ర్తి నాని గెలుపు కోసం ప‌ని చేశారు. పులివ‌ర్తిని గెలిపించుకొస్తే తుడా చైర్మ‌న్ ప‌ద‌వి మీకే అని లోకేశ్ హామీ ఇచ్చిన‌ట్టు ఆయ‌న ధీమాగా చెబుతున్నారు. కావున త‌న‌ను కాద‌ని ఆ ప‌ద‌వి మ‌రొక‌రికి పోయే ప్ర‌శ్నే లేద‌ని ఆయ‌న అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ తెర‌పైకి వ‌చ్చారు. తుడా చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తే, ఎంతైనా ఇస్తాన‌ని ఆయ‌న అంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తుడా చైర్మ‌న్ ప‌ద‌విని వేలానికి పెట్టార‌ని, ఎక్కువ‌కు ఎవ‌రు పాడుకుంటే వాళ్ల‌కే ద‌క్కుతుంద‌ని అన్ని పార్టీల నాయకులు అంటున్న మాట‌. రూ.30 కోట్ల వ‌ర‌కూ ఈ ప‌ద‌వి కోసం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారంటే ఆశ్చ‌ర్య‌పోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఇంత‌కూ ఈ డ‌బ్బంతా ఎవ‌రికి ఇస్తారనే ప్ర‌శ్న అడ‌గ‌కూడ‌దు. చెప్ప‌కూడ‌దు.

5 Replies to “తుడా చైర్మ‌న్ ప‌ద‌వికి భారీ డిమాండ్‌”

  1. మీ అందరికీ ఒక్కటే చెపుతున్నా.. వైస్సార్సీపీ వాళ్లకి డైరెక్ట్ గ , ఇండైరెక్ట్ ఏ పనులు కూడా చేసే పరిస్థితి ఉండకూడదు.. బాబోరు..

    .

    సూపర్ సర్ మీరు… అలా ఉండాలి… అదే జగన్ చూడండి, కులం చూడం మతం చూడం అని అందరినీ సమానం గా చూస్తాం అని చెప్పి, చేస్తే, చాచి మొహాన కొట్టి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించారు…

    .

    అందుకే మీరు సూపర్… ఇన్నాళ్లు రాజకీయాలు చేశారు..

    .

    వీలైతే టాక్స్ లు కూడా.. ఒహ్హ్ సారీ, ఆల్రెడీ చేస్తున్నారు కదా.. అందుకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు టాక్స్ లు కట్టడం లేదు.. అందుకే రావాల్సిన gst , మైన్స్ మీద వచ్చే ఇన్కమ్, లిక్కర్ ఇన్కమ్ ఇంకా.. చాలా తగ్గిపోయాయి కదా.. సారీ, నేను మర్చిపోయా..

  2. మరి దొండకాయ రాయలన్నకు పదవి ఎప్పుడిస్తారు. లేదంటే pendrive బయటపెట్టేస్తాడేమో

Comments are closed.