నిమ్మగడ్డ నిర్ణయం తప్పని ఇప్పుడైనా ఒప్పుకుంటారా?

వైరి పక్షాల బెదిరింపుల వల్లే తాము నామినేషన్లు వేయలేకపోయామని, ఒత్తిడి చేయడం వల్లే కొన్నిచోట్ల నామినేషన్లు ఉపసంహరించుకున్నామనే ఫిర్యాదులు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలు వస్తున్నాయి. అయితే ఆ ఫిర్యాదుల్లో వాస్తవం ఉందా లేక ఎన్నికల ప్రక్రియను…

వైరి పక్షాల బెదిరింపుల వల్లే తాము నామినేషన్లు వేయలేకపోయామని, ఒత్తిడి చేయడం వల్లే కొన్నిచోట్ల నామినేషన్లు ఉపసంహరించుకున్నామనే ఫిర్యాదులు రాష్ట్రవ్యాప్తంగా కోకొల్లలు వస్తున్నాయి. అయితే ఆ ఫిర్యాదుల్లో వాస్తవం ఉందా లేక ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు చేస్తున్నారా, లేక ఇంకెవరి రాజకీయ లబ్ది కోసమో అభ్యర్థులు పావులుగా మారుతున్నారా అనే విషయం బయటపడలేదు.

అయితే ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఏకపక్షంగా ఫిర్యాదిదారుల వాదన సమర్థించారు. ఆరోపణలు వచ్చిన చోట మరో దఫా నామినేషన్ వేసుకోడానికి అవకాశమిచ్చారు. 

మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మొత్తం 11 వార్డుల్లో ఇలా నామినేషన్ వేయడానికి ఒకరోజు ఛాన్సిచ్చారు. అలా అవకాశం ఇచ్చినవారిలో ఎంతమంది నామినేషన్ వేశారో తెలుసా? కేవలం ముగ్గురంటే ముగ్గురే.

అంటే అవకాశం ఇచ్చినా నామినేషన్ వేయలేకపోయారంటే, వారు చేసిన ఫిర్యాదుల్లో పస లేదనే విషయం తేలిపోయింది. బెదిరింపులకి భయపడేవారు రేపు నామినేషన్ వేసినా ప్రచారం చేస్తారన్న నమ్మకం ఏముంది..?

తిరుపతి కార్పొరేషన్లో ఆరు చోట్ల అవకాశం ఇవ్వగా, ముగ్గురు టీడీపి అభ్యర్థులు తిరిగి నామినేషన్ వేయగా, మరో ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ అభ్యర్థి కేవలం ఫిర్యాదులకే పరిమితం అయ్యారు. ఎస్ఈసీ తమకు ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేకపోయారు. 

పుంగనూరులో ఫిర్యాదు చేసి అవకాశం దక్కించుకున్న ముగ్గురిలో ఇద్దరి నామినేషన్లు ఇంకా ఫోర్స్ లోనే ఉన్నాయని అధికారులు చెప్పడం గమనార్హం. అయితే వారిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటామన్నారు. మరొకరు కూడా నామినేషన్ విత్ డ్రా వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. రాయచోటిలో ఇద్దరికి అవకాశం ఇస్తే, అందులో ఒక్కరే నామినేషన్ వేశారు. మరో వ్యక్తి ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

మరి వీరంతా మాకు మరోసారి అవకాశం ఇవ్వండి, సత్తా చూపిస్తామని చెప్పడం దేనికి? కలెక్టర్లకు ఫిర్యాదులు చేసి, ఎన్నికల కమిషన్ ద్వారా ప్రత్యేక అనుమతి తెచ్చుకోవడం దేనికి. నామినేషన్ వేస్తామంటూ రంకెలు వేసినవారు, చివరకు విత్ డ్రా చేసుకోడానికి అవకాశం ఇవ్వమని కోరడం ఏంటి?

ఎస్ఈసీ 11 మందికి అవకాశం ఇస్తే అందులో కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్లకు వచ్చారంటే నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం తప్పని తేలిపోయినట్టే. వీరి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక పరిషత్ ఎన్నికల విషయంలో రచ్చ చేసినవారు కూడా ఇంతేకదా అనే అనుమానం రాకమానదు. 

షర్మిలపై ఆంధ్రా అనే ముద్ర

మీరు మారిపోయారు సార్‌