2024: పర్సన్ ఆఫ్ ది ఇయర్

తన వ్యూహాలను, రాజకీయ చాతుర్యాన్ని, ప్రజలకోసం పునరంకితం కావాలనుకునే ఆకాంక్షను ఏమాత్రం ప్రభావితం చేయజాలదని నిరూపించిన నాయకుడు ఆయన.

రాజకీయాలలో గెలుపు ఓటములు అటుఇటుగా మారుతూ ఉంటాయి. ఆ ప్రకారం చూసినప్పుడు.. చంద్రబాబునాయుడు విజయం అంత ఘనమైనది అనిపించకపోవచ్చు. కానీ.. 23 సీట్లకు పరిమితమైన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం, వృద్ధాప్యం అనేది తన శరీరానికి సంబంధించినదే తప్ప.. తన వ్యూహాలను, రాజకీయ చాతుర్యాన్ని, ప్రజలకోసం పునరంకితం కావాలనుకునే ఆకాంక్షను ఏమాత్రం ప్రభావితం చేయజాలదని నిరూపించిన నాయకుడు ఆయన. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వయసు పెరిగిన కొద్దీ ఆయన వ్యక్తిత్వం ఇనుమడించింది. తనను తాను సమర్థ పాలకుడిగా మరింతగా నిరూపించుకునే తపనతో కష్టపడుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు వెలువడ్డం వెనుక చంద్రబాబునాయుడు కష్టం ఉంది. ఆయన ఏపీలో అత్యంత బలమైన ముఖ్యమంత్రి మాత్రమే కాదు. కేంద్రంలో పాలన సాగిస్తున్న అధికార కూటమిలో రెండో అత్యంత బలవంతుడైన నాయకుడు! అలాగని ‘కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పగల నాయకుడు’ అనే పదాలు కూడా మీడియాలో దొర్లకుండా.. చాకచక్యంగా తన పనులు మాత్రం చక్కబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. సంతులన పరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నారు. హేళనలను దిగమింగుకుంటూ, అవమానాలను భరిస్తూ సహనం వహించినందుకు, బ్యాలెన్స్ తప్పని రాజకీయం చేసినందుకే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అందుకే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘నారా చంద్రబాబునాయుడు పర్సన్ ఆఫ్ ది ఇయర్’!

2019 ఎన్నికల ఫలితాల తర్వాత 23 స్థానాలకు పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడం సాధ్యం కాదని చాలా మంది అంచనా వేశారు. అందుకు అనేక కారణాలున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపరిమితమైన మెజారిటీతో ఘనవిజయం సాధించారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజల మనసు గెలుచుకోవడం లక్ష్యంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా డబ్బులు పంపిణీ అయ్యే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. వాటి ప్రభావం వల్ల ప్రజాబలం ఎప్పటికీ తనకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటూ వచ్చారు. ఆయన ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కొత్త పథకాలు దేశంలో పలువురికి ఆదర్శంగా నిలిచాయి. మరో ముప్పయ్యేళ్లపాటు తానే ముఖ్యమంత్రిని అని జగన్ అనుకున్నారు.

పలువురి అంచనాలు సాగుతుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ ను దాదాపుగా మట్టికరిపించి.. ఎన్డీయే కూటమిని అధికారంలోకి తెచ్చారు చంద్రబాబునాయుడు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పర్ఫెక్ట్ పాలన అందిస్తున్నారని చెప్పలేం. కానీ.. మేనిఫెస్టోల్లో ఒదగని అనేక ప్రయారిటీ అంశాల మీద ఒక్కటొక్కటిగా దృష్టి సారిస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు.

వన్ సైడ్ లవ్ ను పటిష్టబంధం చేసుకుని..

2019 ఎన్నికల సమయంలో ఒంటరిగా పోటీచేసిన పవన్ కల్యాణ్ అయిదేళ్ల నారా చంద్రబాబునాయుడు పరిపాలనను కూడా బీభత్సంగా తిట్టిపోశారు. లోకేష్ ను పెద్ద అవినీతి పరుడిగా అభివర్ణించారు. అసలు ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్తులో ఎప్పటికీ తిరిగి స్నేహం కుదరదన్నంతగా వ్యవహారం చెడింది. కానీ చంద్రబాబునాయుడు ఆ బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి సంశయించలేదు. జగన్మోహన్ రెడ్డి పథకాలు, సమీకరణలు లెక్కించిన ఆయన.. పవన్ అండ లేకుండా ఒంటరి పోటీ అనేది ఆత్మహత్యా సదృశం అని తొలిరోజుల్లోనే గుర్తించారు. అందుకే పవన్ పట్ల తనకు వన్ సైడ్ లవ్ ఉన్నదని, అటువైపు నుచే సిగ్నల్ రావడం లేదని చెప్పుకున్నారు. అవతలి నుంచి సిగ్నల్ రావడానికి దాదాపు ఏడాదికి పైగా పట్టింది.

ఇరు పార్టీల మధ్య మళ్లీ బంధం కుదిరే వాతావరణం వచ్చాక.. పవన్ కల్యాణ్ మాటకు అపరిమితమైన ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన ఈగో దెబ్బతినకుండా చూసుకుంటూ.. స్నేహబంధం పటిష్టంగా స్థిరపడడానికి చంద్రబాబులోని రాజనీతిజ్ఙత కారణం అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఆ స్నేహమే వారి కూటమిని అధికారం వైపు నడిపించింది.

తగ్గుతూ.. దృఢంగా ఉంటూ..

‘ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడేరా హీరో’ అనే డైలాగు పవన్ కల్యాణ్ సినిమాలోదే కావొచ్చు. కానీ.. దానిని ఆచరణలో చూపించిన నాయకుడు చంద్రబాబునాయుడు. పవన్ తో బంధం కుదుర్చుకునే విషయంలో ఆయన ఒక మెట్టు దిగడానికి ఏమాత్రం సంశయించలేదు. వన్ సైడ్ లవ్ అంటూ ప్రపోజ్ చేసినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును బాగా హేళన చేసింది. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. కార్యసాధకుడికి ఇలాంటి విమర్శలు అంటవు అన్నట్టుగా దృఢంగా ఉన్నారు. పవన్ పార్టీ వారు, ఆయన స్వయంగా కూడా అడపాదడపా తెలుగుదేశం గత పాలన గురించి విమర్శలు చేస్తూ వచ్చినా పట్టించుకోలేదు.

తమ వాళ్లెవరూ పవన్ ను పల్లెత్తు మాట అనుకుండా చూసుకున్నారు. అలా తగ్గి తగ్గి మొత్తానికి పవన్ తో స్నేహబంధం కుదిరిన తర్వాత.. చంద్రబాబునాయుడు సీట్ల పంపకం దగ్గరికి వచ్చేసరికి దృఢంగా వ్యవహరించారు. మొదట 60 సీట్లు కావాలని బేరం ప్రారంభించిన జనసేనను 30కి ఒప్పించారు. పొత్తు బంధంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చిన తరువాత.. అదే 30 సీట్లు ఇద్దరికీ కలిపి ఇవ్వగలనని తెగేసి చెప్పారు. అది పవన్ కు అనూహ్యమైన సంగతి కావొచ్చు కానీ చంద్రబాబు దృఢంగానే ఉన్నారు. వారిద్దరూ చివరికి 30కి ఒప్పుకోవాల్సి వచ్చింది. చివరి క్షణాల్లో కొసరు వేసినట్టుగా పవన్ కల్యాణ్ కు ఒకసీటు అదనంగా ఇచ్చారు.

పొత్తు బంధానికి సంబంధించిన ప్రకటన వచ్చే వరకు సౌమ్యంగా రాజకీయం నడిపి.. ప్రకటన వచ్చిన తర్వాత.. తెగేసి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజనీతిని ప్రదర్శించారు. దాని ఫలితమే ఇవాళ ఆయన ఆ రెండు పార్టీలు లేకపోయినా సరే.. అధికారం చెలాయించగల స్థాయి సీట్ల బలంతో వర్ధిల్లుతున్నారు.

ఇక్కడే చంద్రబాబునాయుడు మరో లౌక్యనీతిని కూడా గుర్తించాలి. వారిద్దరూ లేకపోయినా సరే.. ఆయన అధికారానికి, ముఖ్యమంత్రిత్వానికి ఏమాత్రం ఢోకా లేదు. కానీ.. చంద్రబాబు వారిని చిన్నచూపు చూడడం లేదు. రెండు పార్టీలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. కేబినెట్లో మాత్రమే కాదు, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సమతూకం పాటిస్తున్నారు. గెలుపు తర్వాత బోడి మల్లన్న అనేయకుండా.. ఆయన ప్రదర్శిస్తున్న పరిణతి రాజకీయానికి ఎంతో దోహదం చేస్తోంది.

జగన్ చలవ కొంత..

తన మీద ఇతరులు విసిరే రాళ్లను ఏరుకుని సమర్థుడు తన చుట్టూ దుర్గం నిర్మించుకుంటాడు– అని ఒక సామెత ఉంటుంది. చంద్రబాబునాయుడు గత అయిదేళ్లలో అలాంటి వైఖరిని కూడా అనుసరించారంటే అతిశయోక్తి కాదు. జగన్ మోహన్ రెడ్డి వైఖరి చంద్రబాబుకు కొంత మేలు చేసింది. నారా భువనేశ్వరి గురించి వైసీపీ నేతలు లేకిమాటలు మాట్లాడినప్పుడు.. చంద్రబాబు ఖిన్నులయ్యారు. కానీ భీరువు కాలేదు. అసెంబ్లీలో అడుగుపెట్టనని చెప్పారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే.. ఆ ఎపిసోడ్ ఆయన మీద ప్రజల్లో సానుభూతి పెరగడానికి దోహదం చేసింది.

జగన్ చేసిన మరో పెద్ద పొరబాటు.. చివరి సంవత్సరంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయించడం. తొలి రెండేళ్లలోనే చంద్రబాబు అరెస్టు పర్వమూ, బెయిలు పర్వమూ పూర్తయి ఉంటే ప్రజల్లో పుట్టిన సానుభూతి కూడా.. ఎన్నికల నాటికి మాయమైపోయి ఉండేది. సరిగ్గా ఎన్నికల ముందు అరెస్టు చేయించడం ఆయన వ్యూహవైఫల్యం. తద్వారా.. ఊగిసలాడుతున్న పవన్ కల్యాణ్.. జైలులో చంద్రబాబును పరామర్శించి విస్పష్టంగా పొత్తును ప్రకటించడానికి జగన్ తోడ్పాటు అందించారు. ఇలా ప్రత్యర్థులు తలపెట్టిన హానిని కూడా తనకు అనుకూలంగా మలచుకుంటూ కృతకృత్యుడు కావడంలో చంద్రబాబునాయుడు సక్సెస్ అయ్యారు.

పరిణతి గల పాలకుడిగా..

నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు మరింత పరిణతి గల పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో వారి కూటమికి అధికారం దక్కింది. కూటమిలోని అన్ని పార్టీలూ అమరావతి రాజధానికి అనుకూలమైనవే. అమరావతి రాజధాని పనులను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి ఆ పనులు పట్టించుకోలేదని నిందలు వేయడానికి కూడా ఆయనకు ఇదంతా ఉపయోగపడుతోంది.

రాష్ట్రంలో గెలవడానికి పొత్తుబంధం ఒక కీలక కారణం అయితే.. కేంద్రంలో ఆయన రెండో అతిపెద్ద పార్టీకి సారథిగా ఉండడం అనేది చంద్రబాబుకు ఈ దశలో పట్టిన అదృష్టం అని చెప్పాలి. గతంలో మాదిరిగా ఆయన విజ్ఞప్తులను ఏకపక్షంగా తోసిపుచ్చలేని స్థితిలో ఈదఫా మోడీ సర్కారు ఉంది. అందుకే పథకాలకు, రాజధానికి, పోలవరానికి ఇతోధికంగా సాయం అందుతోంది.

ఏ పనులైతే ప్రజల ఎదుటకు కనులకు కనిపిస్తాయో.. ఏ పనులైతే నిర్మాణాత్మక పనులుగా కీర్తి తెచ్చిపెడతాయో.. ప్రభుత్వం పనిచేసింది అనే అభిప్రాయాన్ని ఈ అయిదేళ్ల తర్వాత ప్రజలకు కలిగిస్తాయో అలాంటి పనుల మీద చంద్రబాబు నాయుడు ఎక్స్ ట్రా ఫోకస్ పెట్టడమే ఆయన తాజా రాజనీతి.

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ.. మనిషిలో సహనం, శక్తి తగ్గుతాయని అంటుంటారు. కానీ చంద్రబాబునాయుడు ప్రత్యేకమైన వ్యక్తి. అలాంటి వారు ఆయన ఒక్కరే ఉంటారేమో. డెబ్భయి అయదేళ్ల వయసులో ఆయన ఫిట్ నెస్ చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అసూయ కూడా కలుగుతుంది. సమీక్ష సమావేశాల పేరిట నిరంతరాయంగా కూర్చోవడం కూడా సులువేమీ కాదు. ఆయనలో వయసుతో పాటు శక్తి మాత్రమే కాదు.. సహనం, సంయమనం కూడా పెరుగుతున్నాయని మనం గమనించవచ్చు.

పవన్ కల్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రిగా అనల్పమైన ప్రాధాన్యం ఇస్తుండడం, బాధ్యతల స్పష్టమైన విభజన ఉన్నట్టుగా పనిచేసుకుంటూ పోతుండడం.. ఇవన్నీ ఆయన పరిణతికి నిదర్శనాలే. ఇన్ని లక్షణాల ప్రోదిగా తనను తాను నిరూపించుకుంటున్నారు గనుకనే.. నారా చంద్రబాబునాయుడు ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా నిలవగలుగుతున్నారు.

..ఎల్.విజయలక్ష్మి

39 Replies to “2024: పర్సన్ ఆఫ్ ది ఇయర్”

    1. 1999 nunchi anthe.

      మోసం

      బాబు అంటే వెన్నుపోటు

      బాబు అంటే అబధలు

      బాబు అంటే కుట్ర, 

      బాబు అంటే దోపిడీ, 

      బాబు అంటే అరాచకాలు, 

      బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్

      బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం

      ఇన్ని గొప్ప లక్షణాలు

      తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి

      1. ప్యాలస్ లో వాళ్ళు తినగ మిగిలిన ఎంగిలి పాచి తిండి తమరి ముఖాన కొట్టేసరికి, జగన్ పట్ల బానిస భావం బాగా పెరిగినట్లు వుంది

  1. రెండు ఎకరాల నుండి బినామీ పేర్ల మీద లక్ష ల కోట్లు సంపాయించింది ఎవరో జనాలకి బాగా తెలుసు.

    అవును బాబు ను చూసి నేర్చు కోవాలి

    బాబు అంటే మోసం

    బాబు అంటే వెన్నుపోటు

    బాబు అంటే అబధలు

    బాబు అంటే కుట్ర, 

    బాబు అంటే దోపిడీ, 

    బాబు అంటే అరాచకాలు, 

    బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్

    బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం

    ఇన్ని గొప్ప లక్షణాలు

    తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి

  2. బాబు అంటే మోసం

    బాబు అంటే వెన్నుపోటు

    బాబు అంటే అబధలు

    బాబు అంటే కుట్ర, 

    బాబు అంటే దోపిడీ, 

    బాబు అంటే అరాచకాలు, 

    బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్

    బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం

    ఇన్ని గొప్ప లక్షణాలు

    తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి

    1. 10 లైన్లు రాసావు.. ఇంకొక లైన్ కూడా రాసావంటే 11 లైన్లు అవుతాయి..

      11 అంటే ఒక ఎమోషన్..

      11 అంటే ఒక పతనం ..

      11 అంటే ఒక కామెడీ..

      11 అంటే ఒక నిర్వేదం..

    2. వచ్చాడు అండి వయ్యారి.

      ప్యాలస్ లో పెద్ద వాళ్ళు తినగ మిగిలిని పాచి తిండి బానిసాకోసం పడేసరికి ఆవురావురుమని తినీ డెముడే వచ్చి కేకు పెట్టినట్లు ఫీల్ అవుతున్నాడు.

  3. రాజదాని, పొలవరం, పెట్టుబడులు, అబిరుద్ది, రొడ్లు ఇతర మౌలిక వసతుల కల్పన విషయం లొ చాలా క్లియర్ గా తెడా తెలుస్తుంది. ఇక జగన్ పాలనలొ ఉన్న సంగెషెమం ఎటూ చెస్తున్నారు. పైనా పెన్షన్ పెంచారు, అన్నా క్యంటీన్లు పెట్టారు.

  4. పరిణితి గల పాలన Vs తుగ్లక్ పాలన

    .

    నిజానికి రాజదాని, పొలవరం నిర్మణం జగన్ ఖాతాలొ పడవలసింది. అయితె జగన్ తన తనకి వచ్చిన అవకాశం వినియొగించుకొకుండా తుగ్లక్ నిర్ణయాలతొ మొత్తం చెడకొట్టాడు, చెడిపొయాడు.

  5. పరిణితి గల పాలన Vs తు.-.గ్ల.-.క్ పాలన అంటావా?

    .

    నిజమె! రాజదాని, పొలవరం నిర్మణం జగన్ ఖాతాలొ పడవలసింది. అయితె జగన్ తనకి వచ్చిన అవకాశం వినియొగించుకొకుండా తు.-.గ్ల.-.క్ నిర్ణయాలతొ మొత్తం చెడకొట్టాడు, చెడిపొయాడు.

  6. గంట క్రితం యూట్యూబ్ ఓపెన్ చేసాను.. మరి ఎందుకో యూట్యూబ్ 8 నెలల క్రితం ఒక వీడియో లింక్ ని సజెస్ట్ చేసింది..

    ఆ థంబ్నెయిల్ లో ఇలా రాసి ఉంది..

    సర్వేలన్నీ జగన్ వైపే.. సైలెంట్ అయిన పచ్చ బ్యాచ్ ..

    – ఎన్నికల సర్వేలపై కొమ్మినేని విశ్లేషణ..

    ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి వింటూ.. పెద్ద పెద్ద గా నవ్వుకొంటుంటే.. నా 10 ఏళ్ళ చిన్న కొడుకూ అరుస్తున్నాడు..

    డాడ్ గోన్ మాడ్ మమ్మీ..

    ..

    ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపిస్తే.. 2024 ఎన్నికల ఫలితాల ముందు సాక్షి వీడియో బైట్స్ చూస్తే చాలు.. బతుకు మీద ఆశ.. ప్రపంచమంతా అద్భుతం గా అనిపిస్తుంది..

  7. ఓటుకి నోటు కేసులో అడ్డంగా దొరికి 23 మ్మెల్యే సీట్లకి పడిపోయినవాడిని 2024 పర్సన్ అఫ్ ది ఇయర్ చేసినది మన జగన్ సార్ చేతకానితనం.

    1. వైఎ*స్ఆర్ సొం*త తమ్ము*డిని లేపేసిన వాడిని ఏమీ చేయాలేని ఒక కొ*జ్జా ప్యా*లస్ పుల*కేశి నిజంగా మా*డా ఆఫ్ ది ఇయర్.

    2. లక్ష ఎగ్ పఫ్ లు తిన్నాను అని దొం*గ బిల్లులు పెట్టీ ప్రజ*ల డ*బ్బు దోచు*కున్న ప్యాలస్ పులకేశి దొం*గ ఆఫ్ ద ఇయర్.

  8. ఇన్ని మంచి లక్షణాలు మా సింగల్ సింహం లో ఎందుకు లేవూ అని భాద పడాలో లేక ఇవన్నీ ప్రత్యర్థి లో ఉన్నాయని ఇంకా ఎక్కువ భాధ పడాలో తెలియడం లేదు..

  9. Person of the year సీబీన్ కాదు

    మన జగ్లక్కే

    ఎందుకంటే 151 సీట్లు ఇస్తే బటన్లు నొక్కడం తప్ప ఇంకేం చేతకాని ఎదవ అని తెలిసిన తరువాత ప్రజలు 11 ఇచ్చినారు

  10. పాపం, జీతం డబ్బులు కోసం వెనక్ట రెడ్డి గారు ఆదేశాలతో

    జగన్ నీ వీరుడు, ధీరుడు అని అబద్ధాలు రాసిన చేతులతో,

    కనీసం ఇప్పుడు

    చంద్ర బాబు గురించి నిజాలు రాయాల్సి వచ్చింది.

    కనీసం వృత్తి ధర్మము నిజాయితీ గా చేయడానికి చంద్రబాబు గారి వలన లక్ష్మి అక్కకి అవకాశం వచ్చినందుకు 2024 లో ఈ రోజు లక్కీ డే.

  11. ఏపీ రాజకీయాల్లో జోకర్ గా మిగిలిపోయిన జగన్ , ఏదో అనారోగ్య సమస్య తో భాద పడుతున్నట్లుంది. అతని ఆవభావాలు మరో KA Paul లాగా ఉన్నాయా?

  12. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది , కానీ దురదృష్టం తలుపు తెరిచే వరకూ కొడుతూనే ఉంటుంది అని చెప్తుంటారు.. రాజకీయాల్లో దశాబ్దాలకు పైగా ఉండి , అద్భుతమైన కుటుంబ నేపధ్యం, ధనం , బలగం ఇలా అనేక పాజిటివ్ అంశాలు ఉన్న నాయకులకి కూడా , కోట్లలో ఏ ఒక్కరికో పట్టె అదృష్టం ముఖ్యమంత్రి అనే అత్యున్నత పదవి పొందడం.. అటువంటిది కేవలం పార్టీ పెట్టిన 7 ఏళ్ళలో, కేవలం 40 వ వడిలో ముఖ్యమంత్రి అయిపోయారు జగన్..

    30 ఏళ్ళు సిఎం , కాబట్టి ప్రతిపక్షం ఉండకూడదు.. తెరిచిన ప్రతి గొంతు మూతబడిపోవాలి.. ప్రశ్నించే ప్రతి గొంతుకి కమ్మ ముద్ర వేసేయాలి.. రోడ్డెక్కితే ప్రైవేట్ సైన్యంగా పో లీ స్ లని వాడాలి.మూడు రాజధానుల పేరుతొ వింత నాటకం, అమరావతి ని చం*పేయాలని ఆత్రం.. మధ్యలో శాసనమండలి రద్దు చేస్తాము అని బీరాలు, మళ్ళీ తానే పార్టీ నుంచి సభ్యుల్ని నామినేట్ చేయడం..100 ల్లో సలహాదారులు, ఏమి సలహాలిస్తారో తెలియదు.. ప్రతిపక్ష నాయకుడి భా ర్య, అతని కుమారుడి పు ట్టు క పై తమ సభ్యులతో జుగుస్సాపకరమైన వ్యాఖ్యలు చేయించి, తన మనసు దోచుకున్నావని కితాబు ఇవ్వడం, దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ పై దా డి చేయించి, ఎవడికో బీపీ వచ్చి ఉంటుంది అని నిస్సిగ్గుగా సమర్ధించడం..ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి.. మొత్తంగా చెప్పాలంటే ప్రజల భుజాల మీదని తు పా కీ పెట్టి, సీబీన్ కి గురిపెట్టడానికే ఆ ఐదేళ్లు శక్తివంచన లేకుండా కృషి చేసాడు.. కాబట్టి ప్రజలు ఇచ్చిన ఆ ఒక్క ఛాన్స్ ని దుర్నివినియోగపరిచాడు అని చెప్పక తప్పదు..

Comments are closed.