Advertisement

Advertisement


Home > Politics - Political News

సమంత ఆల్ టైమ్ ఫేవరెట్ వంటకం ఇదే

సమంత ఆల్ టైమ్ ఫేవరెట్ వంటకం ఇదే

సమంత గురించి చాలా విషయాలు చాలామందికి తెలుసు. ఆమెకు బాగా ఇష్టమైన వస్తువులు, వ్యక్తులతో పాటు ఆమె టేస్ట్ గురించి కూడా చాలామందికి ఐడియా ఉంది. అయితే సమంత ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ మాత్రం ఒకటుంది. తనకు ఆ వంటకం అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని స్వయంగా సమంత బయటపెట్టింది.

సమంతకు బాగా ఇష్టమైన వంటకం చేపలు. అది కూడా సాల్మెన్ రకం చేపతో చేసిన వంటకాలంటే సమంతకు బాగా ఇష్టం. తను డైట్ లో ఉన్నా, షూట్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఆ చేపతో చేసిన వెంటకాల్ని తినడానికే ఎక్కువగా ఇష్టపడతానని అంటోంది సమంత.

సల్మెన్ చేపతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా గ్రిల్ టైపు వంటకాలు సాల్మెన్ లో స్పెషల్. అలాంటి ఎన్నో రకాల్ని తినేస్తుంటానని చెబుతోంది సమంత. రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా అవి చాలా హెల్ప్ చేస్తాయని అంటోంది.

ఇన్ని విషయాలు చెప్పిన సమంత ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటున్న విషయాన్ని కూడా బయటపెట్టింది. అవును.. చాలామంది హీరోయిన్లలా ఇప్పుడు సమంత కూడా శాకాహారిగా మారిపోయింది. మాంసాహారంతో పాటు తన ఆల్ టైమ్ ఫేవరెట్ సాల్మెన్ ను కూడా పక్కనపెట్టేసినట్టు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శాకాహారంలోనే రకరకాల రుచులు ట్రై చేస్తున్నట్టు తెలిపింది. అంతా బాగానే ఉంది కానీ, ఇప్పటికిప్పుడు సమంత శాకాహారిగా ఎందుకు మారిందనేది అందరికీ పెద్ద డౌట్.

ఒక ప్రిన్సిపల్ కడుపులో గుండాగాడు పుట్టాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?