తెలంగాణలో సీనియర్ నాయకుడు కే కేశవరావు మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక నేతగా ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల పరిణామాలలో ఆయన ఆ పార్టీని, వారి ద్వారా తనకు వచ్చిన రాజ్యసభ పదవిని కూడా త్యాగం చేసి కాంగ్రెస్ లోకి చేరారు. తద్వారా తన రాజకీయ వారసుల భవిష్యత్తు కాంగ్రెస్ లో సుస్థిరంగా ఉంటుందని నమ్ముతున్న సంకేతాలను ఆయన ప్రజల్లోకి పంపారు.
అయితే తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆ క్షణంలో ఆలోచించారో లేదో తెలియదు. ఇప్పుడు అనూహ్యంగా ఆయన రాజకీయ ప్రస్థానానికి తెరపడిందా? లేదా, ఈ పరిణామానికి ఆయన ముందే ఒప్పుకొని అప్రకటిత సన్యాసం తీసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది.
కే కేశవరావు తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు.. ఆ స్థానానికి జరిగే ఉపఎన్నికలో తిరిగి ఆయనని అభ్యర్థిగా పోటీ చేయిస్తారని అందరూ ఊహించారు. అలాంటి అవకాశం ఉన్నది గనుకనే పదవికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదు గనుకనే ఆయన రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ లోకి వచ్చారని.. లేకపోతే పదవిని వదలకుండా కాంగ్రెస్ పంచన చేరి ఉండే వారని పలువురు అంచనా వేశారు.
తీరా రాజ్యసభ ఎన్నికలు వచ్చిన సమయానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ ని ప్రకటించడం ఆశ్చర్యకర పరిణామం. తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం వద్ద మంచి మార్కులు సంపాదించుకోవడానికి అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ అవకాశం కట్టబెట్టడం ఒక మార్గం అవుతుందేమో గాని ఇది బహుశా కేశవరావు అనుమానులకు మింగుడు పడని విషయం కావచ్చు.
భారత రాష్ట్ర సమితి కే కేశవరావును మాత్రం గౌరవంగానే చూసుకుంది. ప్రతి సమావేశంలోనూ తన చెంత కూర్చుని పెట్టుకుని ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కేశవరావు పార్టీని వీడినప్పుడు ఆయన మనస్థాపానికి గురయ్యారు కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ తనకు మాతృ సంస్థ అని చెప్పుకుంటూ వారసుల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న కేశవరావు ఈజీగా గులాబీ దళాన్ని వీడి వచ్చారు. ప్రస్తుతానికి ఆయనకు షాక్ తగిలినట్లుగా కనిపిస్తుంది.
అయితే పార్టీ వివిధ సమీకరణల దృష్ట్యా రాజ్యసభ అభ్యర్థిత్వానికి అభిషేక్ మను సింఘ్వీని ఎంపిక చేయడం జరిగిందని కేశవరావు కు తగిన ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏ రకంగా కేశవరావులో ఉండగల అసంతృప్తిని నాయకులు బుజ్జగిస్తారో తెలియదు.
మచిలీపట్టణం మాజీ బిడ్డ కేకే …
ఎప్పుడూ చేపల తక్కెడ లాగా ఇటు అటు… అటు ఇటు….
ఎవడో సరయినాడు చేపల పులుసు చేసేస్తాడు.
Avunu. Waste fellow
Nuv inka comments pedtunava gantipanu….. Anniuyaa debbaki paripoyavemo ankuna…. Anniyuyaa oka mlc gelichi 5yrs kallu muskondi vachestunnam antunadu…. Evadikana chupinchara gantipanu me anniuyuaa
మాబాగా జరిగింది, యూపీఏ హయాంలో పోలవరం నిర్వాసితుల గురించి మీటింగ్ జరిగితే అప్పటి కేంద్ర మంత్రి కావూరి మీద విమర్శలు చేసాడు, సాటి కాంగ్రెస్ సభ్యుడు అయి ఉండి.
manchi nirnayam. BRS to vunti cheppu kottkovadam.
Vc estanu 9380537747
అభిమానులా