తెలంగాణలో ఒకేసారి మూడు ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్‌ని ఉడికించడానికి కేటీఆర్ నిత్యం రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఉప ఎన్నికలపై కేటీఆర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
స్టేషన్ ఘన్పూర్ తాజా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మార్పాక రవి ఇవాళ కేటీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వస్తుందని, మాజీ మంత్రి రాజయ్య విజయం సాధించడం ఖాయమన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు వెళ్లాలని చూస్తున్నామన్నారు.
హైకోర్టులో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై కేసు నడుస్తోందన్నారు. ఈ ముగ్గురిపై ఒకేసారి అనర్హత వేటు పడే అవకాశం వుందన్నారు. వీళ్ల ముగ్గురు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒకేసారి ఉప ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి, మోదీతో కలిసి లేని వాళ్లకు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అందరం మోసపోయామని కేటీఆర్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రసక్తే వుండదని కేటీఆర్ తేల్చి చెప్పారు.
Enito ee lekkalu, monna parliament okti gelavaledu. Emo CM ayyipodamani.
KCR, KTR kevalam vaallaki unna gudha balupu valane odipoyaaru, vaalla panithanam bagane unde.. parliment elections veru, state elections veru.
Vc available 9380537747
జీరోను ఎవరు విలీనం చేసుకుంటారులే..
వీడు ఇంకో వేణు స్వామి గాడు
Dr T. Rajaiah ku ticket echi BRS party ni Station ghanpur lo votamipalu cheyakandi KTR Brother