బాలీవుడ్ ఆఫర్ వస్తే ఎగిరి గంతేసే రోజులు పోయాయి. సౌత్ లో కాస్త క్రేజ్ ఉన్న ఏ హీరోయిన్ కైనా హిందీ నుంచి పిలుపు రావడం ఖాయం. ఎటొచ్చి మంచి ప్రాజెక్టు సెట్ చేసుకోవడం అన్నది హీరోయిన్ చేతిలో పని.
ఈ విషయంలో శ్రీలీల తప్పటడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి ఆమెకు అవకాశం అయితే వచ్చింది కానీ అది తనకు ఏ మేరకు ఉపయోగపడుతుందనేది ఆమెకే తెలియాలి.
ప్రస్తుతం మిట్టి అనే సినిమా చేస్తున్నాడు సిద్దార్థ్ మల్హోత్రా. ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో నటించడానికి ఆమె ఎలా అంగీకరించిందనేది ప్రశ్నార్థకం.
క్రమం తప్పకుండా ఏడాదికో సినిమా చేస్తున్నాడు సిద్ధార్థ్. కానీ అతడికి స్టార్ డమ్ రాలేదు. పైగా మిట్టీ అనే ప్రాజెక్టుకు క్రేజీ దర్శకుడు కూడా లేడు. ఇలాంటి సినిమాలో నటించడానికి శ్రీలీల ఎలా అంగీకరించిందో ఆమెకే తెలియాలి.
మిట్టి కథ శ్రీలీలకు నచ్చిందని కొందరు అంటుంటే, భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో ఓకే చెప్పినట్టు మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఆమె నిర్ణయం సరైనది కాదంటున్నారు చాలామంది.
శ్రీలీలకు టాలీవుడ్ లో రోజులు బాగాలేవు. వరుసగా ఫ్లాపులు. గుంటూరుకారం తర్వాత ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అయినప్పటికీ కాస్త వెయిట్ చేస్తే ఆమెకు మంచి అవకాశాలే వస్తాయి. మొన్నటికిమొన్న నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆమెకు మంచి ఆఫర్ ఇస్తున్నట్టు, ఓ వేదికపై ఓపెన్ గా ప్రకటించారు.
సో.. శ్రీలీలకు ఇంకా క్రేజ్ ఉంది. కాకపోతే ఆమె కాస్త ఓపిక పట్టాలి. ఇలాంటి టైమ్ లో క్రేజ్ లేని బాలీవుడ్ సినిమా ఒప్పుకొని, రెండు పడవల ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు.
Vc estanu 9380537747
Call boy jobs available 8341510897
ఈవిడ అంగీకరించింది ఏమిటి? చేతిలో సినిమా లేకపోతే ఈ ఆఫర్ పెద్దగా కనపడుతున్నది okay అంది. ఎక్కడ అయినా అదే హీరోయిన్ రోల్ songs and a few dialogues thats it.
నువ్వు ఆమెకి broker గా చేరి, మంచి అవకాశాలు ఇప్పించవచ్చు కదా!
Remuneration yekkuva isthe movies chestharu evaraina anthe
జనం పట్టించుకోరు