సంక్షేమ ప‌థ‌కాల సైంధ‌వుడాయ‌న‌!

మంత్రి అనిల్‌కుమార్ మాట‌ల తూటాలు పేల్చ‌డంలో దిట్ట‌. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌డంలో ఆయ‌న ఏ మాత్రం ముందూవెనుకా ఆలోచించ‌ర‌నే పేరు తెచ్చుకున్నారు.  Advertisement ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా మంత్రి అనిల్‌కుమార్ గుర్తింపు పొందారు.…

మంత్రి అనిల్‌కుమార్ మాట‌ల తూటాలు పేల్చ‌డంలో దిట్ట‌. ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌డంలో ఆయ‌న ఏ మాత్రం ముందూవెనుకా ఆలోచించ‌ర‌నే పేరు తెచ్చుకున్నారు. 

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా మంత్రి అనిల్‌కుమార్ గుర్తింపు పొందారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ ప్ర‌క‌టించిన ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వివాదానికి తెర‌లేపారు.

ప‌నిలో ప‌నిగా ఎన్నిక‌ల కోడ్ అంటూ సంక్షేమ ప‌థ‌కాల‌కు మోకాల‌డ్డేందుకు య‌త్నించారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం అమ్మ ఒడి రెండో విడ‌త అమ‌లు కార్య‌క్ర‌మాన్ని నెల్లూరు జిల్లా వేదిక‌గా ప్రారంభించేందుకు సీఎం జ‌గ‌న్ ప్రోగ్రాంను అధికారులు సిద్ధం చేశారు. అయితే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన కార‌ణంగా ఈ సంక్షేమ కార్య‌క్ర‌మం అమ‌లుపై అనుమానాలు తలెత్తాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తార‌న్నారు. అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభిస్తార‌ని తేల్చి చెప్పారు.  రేపు 45 లక్షల మందికి అమ్మఒడి అందజేస్తాయని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు. 

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడ్డుకుంటున్నారని తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. పేదలకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందకుండా అడ్డుపడ్డారన్నారు. 

చంద్ర‌బాబు కోస‌మే నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది అనిల్‌కుమార్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయం. 

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ