దర్శకుడు శంకర్ హైదరాబాద్ వస్తున్నారంటే, మీడియా మీట్ పెడుతున్నారంటే ఆసక్తి అంతా గేమ్ ఛేంజర్ సినిమా చుట్టే. ఎందుకంటే శంకర్ సినిమాలకు ఆయన తప్పు మరెవరు అప్ డేట్ ఇవ్వలేదు. ఏదైనా శంకర్ చెప్పాల్సిందే. అందుకే ఇండియన్ 2 సంగతి పక్కన పెట్టి మీడియా జనాలు అదే క్వశ్చను సంధించారు.
గేమ్ ఛేంజర్ సినిమా విడుదల ఈ ఏడాది వుంటుందా? కానీ అక్కడున్నది శంకర్ కదా. స్ట్రయిట్ గా ఆన్సర్ ఎందుకు చెబుతారు. రామ్ చరణ్ పార్ట్ షూట్ పూర్తయింది, మిగిలిన షూట్ పూర్తి కావాలి. ఎడిటింగ్ చేసి, ఫైనల్ కట్ సెట్ చేయాలి. అప్పుడు అప్ డేట్ ఇస్తాం అన్నారు.
అప్ డేట్ ఎప్పుడు ఇచ్చినా ఈ ఏడాది విడుదల వుంటుందా? అన్నదే మళ్లీ ప్రశ్న. కానీ మళ్లీ జవాబు అదే. సినిమా అంటే నిర్మాత, హీరో, దర్శకుడు. ఈ ముగ్గురు కలిసి డిస్కస్ చేసి ఫిక్స్ చేయాలి అంటూ. అంతే ఇంకేం లేదు.
గేమ్ ఛేంజర్ మరో ఇరవై రోజుల షూట్ వుంది. ఈ నెల 12న ఇండియన్ 2 తరువాత శంకర్ కాస్త విశ్రాంతి తీసుకుంటారు. వరుసగా ప్రమోషన్లు చేస్తూ వున్నారు కనుక ఆ మాత్రం రెస్ట్ కావాలి. అది అయిన తరువాత గేమ్ ఛేంజర్ బ్యాలన్స్ వర్క్ పూర్తి చేయాలి. అంటే ఆగస్ట్ చివరకు వర్క్ పూర్తవుతుంది. సెప్టెంబర్ లో ఫైనల్ కాపీ రెడీ అయితే డేట్ అనౌన్స్ మెంట్ వుండొచ్చు. బహుశా క్రిస్మస్ కే వుంటుందని అనుకోవాలి గేమ్ ఛేంజర్ విడుదల.