Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నటి కస్తూరి… పడకగది ఆరోపణలు.. తెలుగు హీరోపైనే?

 నటి కస్తూరి… పడకగది ఆరోపణలు.. తెలుగు హీరోపైనే?

మరో హీరోయిన్ ఓపెనప్ అయ్యింది... సినిమాల్లో అవకాశాలంటూ హీరోయిన్లకు ఎదురయ్యే వేధింపుల గురించి ప్రస్తావించింది. ఇటీవలి కాలంలో హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరిస్తూ ఉండగా, ఈ జాబితాలో ఈ సీనియర్ నటీమణి కూడా చేరింది. తమిళంతో పాటు తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించిన కస్తూరి.. ప్రత్యేకించి ఒక హీరోపై సంచలన ఆరోపణలే చేసింది. అతడు తనను పడకగదికి రప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడని ఆమె చెప్పింది.

అతడితో తను ఒక సినిమాలో నటించాను అని... అయితే తను తలొగ్గలేదని, దీంతో తీవ్రమైన అసహనంతో అతడు రగిలిపోయాడని కూడా కస్తూరి చెప్పుకొచ్చింది. తను లొంగడం లేదని షూటింగ్ సమయంలోనే అతడు  తనపై విరుచుకుపడేవాడు అని, పడకగదికి తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించాడని, అతడికి “నో’’ చెప్పడం నచ్చదు అని కూడా కస్తూరి వివరించింది. మరి అతడెవరు? అనే అంశం గురించి సూటిగా చెప్పలేదు కానీ, అతడు ఇప్పుడు రాజకీయ నేతగా ఉన్నాడని మాత్రం ఆమె చెప్పింది. అతడితో తను ఒకే సినిమాలో నటించాను అని కూడా ఆమె చెప్పింది.

కేవలం ఒకేసినిమాలో అతడితో కలిసి నటించాను అని.. తను లొంగనని అర్థమై తర్వాత రెండో సినిమాల నుంచి తనను ఆ హీరో తప్పించాడని కూడా ఆమె చెప్పింది. మరి క్లూలను బట్టి, సినిమాల బయట కూడా “నో’’ చెప్పడం నాకు నచ్చదు అనే అటిట్యూడ్ ఉన్న హీరో..  ఎవరనేది నిర్ధారించుకోవడానికి గూగుల్ ను ఆశ్రయించవచ్చు. అతడితో తను ఒకే సినిమాలో చేశాను, అతడు రాజకీయాల వైపు వెళ్లాడని ఆమె చెప్పడాన్ని బట్టి చూస్తే.. ముగ్గురు హీరోలు షార్ట్ లిస్ట్ అవుతారు. కస్తూరికి ఒకే సినిమాలో అవకాశం ఇచ్చి, రాజకీయాల వైపు వెళ్లిన తెలుగు హీరోలు ఇద్దరు. అలాగే ఒక తమిళ హీరో కూడా కస్తూరితో ఒకే సినిమా చేశాడు. రాజకీయాల్లో ఉన్నాడు.

ఈమెతో ఒకే సినిమాలో చేసిన తెలుగు హీరోలు కమ్ రాజకీయ నేతలిద్దరికీ హీరోయిన్లతో ప్రవర్తన విషయంలో చాలా చెడ్డ పేరు ఉంది ఇండస్ట్రీలో. మరి వీరిద్దరిలో కస్తూరి ఎవరి బాధితురాలో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?