Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్‌కి ఈసారి పవన్‌తో ప్రాబ్లమ్‌?

చరణ్‌కి ఈసారి పవన్‌తో ప్రాబ్లమ్‌?

'ధృవ' చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్‌ చేయకుండా, డిసెంబర్‌లాంటి అన్‌ సీజన్‌లో రిలీజ్‌ చేయడానికి వెనకో బలమైన కారణముంది. సంక్రాంతికి చిరంజీవి కమ్‌బ్యాక్‌ సినిమా ఖైదీ రిలీజ్‌ వుండడంతో దానికి అడ్డు తగలకుండా చరణ్‌ త్యాగం చేసాడు. ఈ కారణం మీద ధృవ వసూళ్లపై కాస్త ప్రభావం పడింది. మంచి సీజన్‌లో వచ్చినట్టయితే ఆ టాక్‌కి ధృవ మరో అయిదారు కోట్లు ఎక్కువే వసూలు చేసి వుండేది.

ధృవకి అలా జరిగితే, ఇప్పుడు చరణ్‌ మలి చిత్రానికి పవన్‌ సినిమాతో క్లాష్‌ పడేలాగుంది. పవన్‌, త్రివిక్రమ్‌ల చిత్రాన్ని వాయువేగంతో పూర్తి చేసి దసరాకి విడుదల చేయాలని చూస్తున్నారు. మరోవైపు చరణ్‌, సుకుమార్‌ల చిత్రానికి కూడా అదే ముహూర్తం పెట్టుకున్నారు. పవన్‌ సినిమా రిలీజ్‌ దసరాకి ఖరారైతే చరణ్‌ డైరెక్ట్‌ క్లాష్‌కి వెళ్లకపోవచ్చు.

పవన్‌ సినిమాకి స్పేస్‌ ఇవ్వడం కోసం దసరా ముందో, వెనకో చరణ్‌ చిత్రం వస్తుందేమో. హాలిడే సీజన్‌ మిస్‌ అయితే పెద్ద బడ్జెట్‌ సినిమాలకి పెద్ద తలనొప్పే కనుక ఈసారి బాబాయ్‌తో వచ్చి పడే సమస్యకి చరణ్‌ ఏం పరిష్కారం వెతుకుతాడో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?