లక్ష్మీనరసింహా+పోకిరి?

పూరి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్నటెంపర్ స్టోరీ లైన్ పై గ్యాసిప్స్ రావడంతోనే  ఆ సినిమా బాలకృష్ణ లక్ష్మీ నరసింహా, పూరి పోకిరి లకు దగ్గరగా వుందని టాక్ మొదలైంది. కరెప్ట్ పోలీస్…

పూరి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్నటెంపర్ స్టోరీ లైన్ పై గ్యాసిప్స్ రావడంతోనే  ఆ సినిమా బాలకృష్ణ లక్ష్మీ నరసింహా, పూరి పోకిరి లకు దగ్గరగా వుందని టాక్ మొదలైంది. కరెప్ట్ పోలీస్ ఆఫీసర్..విలన్ తో టై అప్ అంటే లక్ష్మీనరసింహా….విలన్ పక్కనే వుంటే, అండర్ కరెంట్ గా దెబ్బతీయడం అంటే పోకిరి గుర్తుకు వస్తున్నాయంటున్నారు. ఎటొచ్చీ హీరో క్యారెక్టరైజేషన్ పూరి స్టయిల్ లో వుంటదని అంచనా వేస్తున్నారు. 

ఎన్టీఆర్ తన కరెప్షన్ వల్ల కొంతమంది ఎఫెక్ట్ కావడం అనేదాన్ని తెలుసుకుని రియలైజ్ కావడమే ఇంటర్వెల్ బ్యాంగ్ అయి వుంటుందని,. అంటే ఇంటర్వెల్ కు ముందు లక్ష్మీ నరసింహా, తరువాత పోకిరి చూపిస్తారేమో అని చమక్కులు వేస్తున్నారు. ఏదైనా ఈ వ్యవహారాలన్నీ కలసి టెంపర్ పై ప్రేక్షకులకు ఓ రకమైన ఆసక్తిని కలుగచేస్తున్నాయన్నది మాత్రం వాస్తవం.