‘అల్లుడు’కి రెండో ప్రాజెక్టు ఓకె

మొత్తానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు కెరియర్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. తొలి సినిమా విడుదలై రెండువారాలు దాటకుండానే మరో సినిమాకు రంగం రెడీ చేసేస్తున్నాడు. మాస్ మంత్రమే కలెక్షన్లకు…

మొత్తానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు కెరియర్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. తొలి సినిమా విడుదలై రెండువారాలు దాటకుండానే మరో సినిమాకు రంగం రెడీ చేసేస్తున్నాడు. మాస్ మంత్రమే కలెక్షన్లకు కీలకం కాబట్టి కొడుకు శ్రీనివాస్ ను మాస్ హీరోగానే ప్రొజెక్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. అందుకే రెండో సినిమాకు దర్శకుడికి బోయపాటి శీనును ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. 

ఈ మేరకు బోయపాటి వినిపించిన లైన్ ను బెల్లంకొండ ఓకె చేసినట్లు బోయపాటి సన్నిహిత వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రీనివాస్ తో మంచి ఫ్యామిలీ సినిమా చేస్తానని దిల్ రాజు, చేయమని వినాయక్ చెప్పినా, బెల్లంకొండ మాత్రం మాస్ సినిమా వైపే మొగ్గినట్లు తెలిసింది. మాస్ సినిమాలయితేనే, జయాపజయాలు ఎలా వున్నా కలెక్షన్లు ఫర్వాలేని స్థాయిలో వుంటాయని, అలా శ్రీనివాస్ తనకంటూ ఓ మార్కెట్ తెచ్చుకున్నాకే ఫ్యామిలీ సినిమాలు చేస్తే బెటరన్నది సురేష్ ఆలోచనగా తెలుస్తోంది.