ఐ కోసం నిబంధనలు పక్కకు?

అమలు చేసేది మనమే అయితే, నిబంధనలు అన్నీ తోసి రాజని అనేయవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ చాంబర్ వ్యవహారం అలాగేవుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గుసగుసలే కాదు..ఇవి నిరసన దిశగా కూడా సాగుతున్నాయని వినికిడి.  Advertisement ఇంతకీ…

అమలు చేసేది మనమే అయితే, నిబంధనలు అన్నీ తోసి రాజని అనేయవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ చాంబర్ వ్యవహారం అలాగేవుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గుసగుసలే కాదు..ఇవి నిరసన దిశగా కూడా సాగుతున్నాయని వినికిడి. 

ఇంతకీ విషయం ఏమిటంటే, సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదని రెండేళ్ల క్రితం ఫిలిం చాంబర్ నిర్ణయించింది. ఆ మేరకు అప్పట్లో దిల్ రాజు శంకర్ త్రీ ఇడియట్స్ సినిమా హక్కులు కొన్నా కూడా, జనవరి 26న విడుదల చేసుకున్నారు. అప్పట్లో ఆ సినిమా తమిళనాట సంక్రాంతికే విడుదలయింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది. 

శంకర్-విక్రమ్ ల విజువల్ ట్రీట్ ఐ విడుదలకు రెడీ అవుతోంది. సంక్రాంతికి అని ప్రకటించేసారు. కానీ చాంబర్ ఏమీ మాట్లాడడం లేదు. దీనికి కారణం, ఆ సినిమా తెలుగు వెర్షన్ హక్కుల్లో చాంబర్ అధ్యక్షడు ఎన్ వి ప్రసాద్ కు కూడా భాగస్వామ్యం వుండడమే అని అంటున్నారు. దీని మీద కొంతమంది చాంబర్ తీరుపై లోలోపల గుర్రుగా వున్నారు. దీన్ని చాంబర్ లో ప్రస్తావించాలని కొందరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సారి సంక్రాంతికి ముందు ఎన్టీఆర్-పూరి సినిమా, సంక్రాంతికి పవన్-వెంకీల సినిమా ఇప్పటికి షెడ్యూలు అయ్యాయి. ఐ విడుదల అయితే, ఆ ప్రభావం ఈ రెండింటిపై వుండే అవకాశం వుంది.