తేజ ముంచేస్తాడట

ఒకె పంథాలో సినిమాలు తీసి తీసి, ఫ్లాపులు చూసిన దర్శకుడు తేజ మళ్లీ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. మళ్లీ షరా మామూలుగా అందరూ కొత్తవాళ్లే. అయితే కొత్త విషయం ఏమిటంటే, సినిమా ఆద్యంతం…

ఒకె పంథాలో సినిమాలు తీసి తీసి, ఫ్లాపులు చూసిన దర్శకుడు తేజ మళ్లీ మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. మళ్లీ షరా మామూలుగా అందరూ కొత్తవాళ్లే. అయితే కొత్త విషయం ఏమిటంటే, సినిమా ఆద్యంతం వానలో జరుగుతుందట. ఏ ఫ్రేములో చూసినా వానేనట. 

అదేదో సినిమాలో తనికెళ్ల చెప్పినట్లు, అన్ని వానలెందుకురా నాన్నా..అసలే నీళ్ల కరువు అని అనడానికి కూడా లేదు ఎందుకంటే, తేజ హిట్ కొట్టాలనే కసిమీద వున్నాడు. వింటాడా మరి. కానీ ఒక్కటీ ఇలా నీళ్లు కారే సినిమా తీసి ఎమ్ ఎస్ రాజు మళ్లీ ఇంతవరకు తేరుకోలేదు. ఆ వాన సినిమాను చూసయినా తేజ జాగ్రత్తపడాలి మరి. నీళ్లంటే ఊరికనే రావు. డబ్బును నీళ్లలా ఖర్చుచేయాల్సిందే.