బెల్లంకొండ సినిమాపై రెండు రోజుల్లో క్లారిటీ

అల్లుడు శ్రీను విడుదల కాకుండానే అట్టహాసంగా ప్రారంభమైంది బోయపాటి..బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్. నిజంగా బోయపాటి లాంటి డైరక్టర్ అంటే మరి ఇలాంటి అలాంటి ప్రాజెక్టు కాదు మరి. అయితే అల్లుడు శ్రీను తరువాత బెల్లకొండ…

అల్లుడు శ్రీను విడుదల కాకుండానే అట్టహాసంగా ప్రారంభమైంది బోయపాటి..బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్. నిజంగా బోయపాటి లాంటి డైరక్టర్ అంటే మరి ఇలాంటి అలాంటి ప్రాజెక్టు కాదు మరి. అయితే అల్లుడు శ్రీను తరువాత బెల్లకొండ కార్డులు తిరగడపడ్డాయి. దాంతో ఈ ప్రాజెక్టు అయోమయంలో పడింది. వేరేవాళ్లకి అప్పగించేసారనీ లేదు బెల్లంకొండే చేస్తారనీ ఇలా రకరకాల మాటలు. 

ఆఖరికి ఇప్పుడు ఈ సినిమాను పైనల్ చేసే దిశగా చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. సినిమా షెడ్యూలు మొత్తం సవరించి, వీలయినంత తగ్గించి, బడ్జెట్ అంచనాలు సవరించి, కాల్ షీట్లు అవీ మార్చి, సినిమాను ట్రాక్ మీదకు తేవాలన్నది ప్లాన్, అప్పటికీ కుదరదు అంటే అది వేరే సంగతి. మొత్తానికి ఏ సంగతీ రెండు రోజుల్లో తేలిపోతుంది.