హైద్రాబాద్‌కి చెందిన మహిళా టెకీ అదృశ్యమైంది. భరణి అనే మహిళా టెకీ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 26న బెంగళూరుకి పయనమైన భరణి ఆచూకీ తెలియడంలేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే భరణి పనిచేస్తోన్న సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రం ఆమె విధులకు హాజరు కాలేదని చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితమే హైద్రాబాద్‌కి చెందిన మరో సాఫ్ట్వేర్ టెకీ భవ్యశ్రీ అదృశ్యం అప్పట్లో కలకలం సృష్టించింది. ఇంటి నుంచి విధులకని వెళ్ళిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. తన భార్య కనిపించడంలేదంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు విచారించిన పోలీసులు, భవ్యశ్రీని విశాఖ జిల్లాలో కనుగొన్నారు. తననెవరూ కిడ్నాప్ చేయలేదనీ, తనంతట తానుగా వెళ్ళిపోయాననీ భవ్యశ్రీ పోలీసులకు చిక్కిన అనంతరం వ్యాఖ్యానించడం గమనార్హం.
భవ్యశ్రీ ఎపిసోడ్లో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. వ్యక్తిగత కారణాలతో ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోవడం, భర్త హైరానాతో కిడ్నాప్‌గా అంతా భావించడం మీడియాలో నానా గందరగోళం రేగడంతో చాలామంది ఈ ఎపిసోడ్‌పై పెదవి విరిచారు. ఇక భరణి విషయంలో ఏం జరుగుతుందోగానీ, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. భరణి అదృశ్యం సుఖాంతమవ్వాలని ఆశిద్దాం.