రేష్మికి ఇబ్బందిగా వుందట

రేష్మిగౌతమ్..జబర్ధస్త్ ..ఖతర్నాక్ కామెడీ షో. అనసూయ తరువాత వారసత్వంగా ఈ షో ఏంకరింగ్ చేపట్టిన రేష్మి ఇప్పుడు అక్కడ దుమ్ము దులిపేస్తోంది. అయితే జనాలకు గుర్తుందో లేదో కానీ, అంతకు ముందు రేష్మి డజను…

రేష్మిగౌతమ్..జబర్ధస్త్ ..ఖతర్నాక్ కామెడీ షో. అనసూయ తరువాత వారసత్వంగా ఈ షో ఏంకరింగ్ చేపట్టిన రేష్మి ఇప్పుడు అక్కడ దుమ్ము దులిపేస్తోంది. అయితే జనాలకు గుర్తుందో లేదో కానీ, అంతకు ముందు రేష్మి డజను సినిమాల వరకు చేసింది. చిన్న చితక సినిమాలు. కానీ ఆ సినిమాలు చిన్నవైనా రేష్మి ఆరబోసిన అందాలు తక్కువేమీ కాదు. 

ఇప్పుడు చిన్న సినిమాల నుంచి చిన్న తెరపైకి వచ్చిన రేష్మి, మాంచి పాపులారిటీ సంపాదించేసుకుంది. సోషల నెట్ వర్క్ సైట్లలొ ఆమెకు అభిమానులు పెరిగిపోయారు. అక్కడితో సరిపోతే బాగుండేది. కానీ యూ ట్యూబ్ వెదికి వెదికి, గాలించి, రేష్మి పాత సినిమా పాటల క్లిప్పింగ్ లు సంపాదించి, షేర్ చేసుకుంటున్నారట. అవన్నీ ఇప్పుడు చూడ్డానికి రేష్మికి కాస్త ఇబ్బందిగావుందని వినికిడి.