‘పచ్చ’పాత పత్రికలు కళ్లు తెరవాలి

టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి  జాతీయ ఆంగ్ల దినపత్రికకు కనిపించింది..రాజధాని పేరిట పచ్చని పొలాలను రోడ్లగా మార్చేసే వైనం..రైతులను బికారులను చేసే పథకం. కానీ మన సోకాల్డ్ తెలుగువారి ప్రతిధ్వనులు, మానసపుత్రికలకు మాత్రం ఏమీ…

టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి  జాతీయ ఆంగ్ల దినపత్రికకు కనిపించింది..రాజధాని పేరిట పచ్చని పొలాలను రోడ్లగా మార్చేసే వైనం..రైతులను బికారులను చేసే పథకం. కానీ మన సోకాల్డ్ తెలుగువారి ప్రతిధ్వనులు, మానసపుత్రికలకు మాత్రం ఏమీ చీమకుట్టినట్లు లేదు. బ్రాహ్మిణి కోసం కొండలు, రాళ్లు రప్పలు ఇస్తే,,జింకలున్నాయి. సహజ అందాలు పోతున్నాయి అని గగ్గోలు పెట్టినవారికి ఈ పచ్చటి పోలాలు, వాటి అందాలు, సెలయేళ్లు. రైతులు, వారి గుండే కోతలు కనిపించడం లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం చాలా తెలివిగా, అందమైన పథకం వేసినట్లు పైకి కనిపిస్తోంది కానీ, నిజానికి చివరకు వచ్చేసరికి రైతులు బికారులు అవడం ఖాయమని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కోంది. ఆరంభంలో 4500 గజాలు (ఎకరా) తీసుకుని 2200 ఇస్తామన్న ప్రభుత్వం, తీరా ఆచరణ దగ్గరకు వచ్చేసరికి అందులో సగం రోడ్లు పార్కలు, క్లబ్ లకు వదిలేసి, మిగిలిన 2200లో 1200 తాను వుంచుకుని రైతుకు వెయ్యి గజాలు మాత్రం ఇస్తానంటోంది. ఇదెంత దారుణం అని ఆ కథనం ఎత్తి చూపింది.

రియల్ ఎస్టేట్ జనాలకు తమ తమ వాటా ఎలా అమ్ముకోవాలో,. అంతస్తులపై అంతస్తులు కట్టి ఎలా లాభం పొందాలో బాగా తెలుసు. కానీ బక్క రైతులు తమ వెయ్యి గజాలు అమ్ముకోవడానికి ఏళ్లు పడుతుంది. నాలుగువేల ఎకరాలతో రాజధాని కడితే పోయేదానికి ప్రభుత్వం ముఫై వేల ఎకరాల పచ్చటి పోలాలు నాశనం చేయడం తగదని కృష్ణా జిల్లా రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మరి ఈయన ఈనాడుకు  అప్పుడు అప్పుడు రైతు వ్యాసాలు రాసే కాలమిస్టు. ఇప్పుడు మరి ఈ మేరకు అందులో సమగ్ర వ్యాసం ఎందుకు రాయకూడదు. రాసినా వాళ్లు ప్రచురించరనా? పొనీ రైతుల తరపును ఎందుకు ఉద్యమించకూడదు?

ఇప్పటికైనా తెలుగుమీడియా కళ్లు తెరిచి, రైతులకు, ఆంధ్రదేశం అన్నపూర్ణ అన్న పేరు చెడగొట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను బట్టబయలు చేయాలి.