సుకుమార్ ఆశ చావలేదు

ఓ ఫ్లాపు నుంచి మరో హిట్ కు దారి చేసుకోవడం అంత వీజీ కాదు. అందునా పెద్ద ఫ్లాపు నుంచి పెద్ద హీరో సినిమా దొరకపుచ్చుకోవడం అంటే మరీనూ. ఇప్పుడు దర్శుకుడు సుకుమార్ ది…

ఓ ఫ్లాపు నుంచి మరో హిట్ కు దారి చేసుకోవడం అంత వీజీ కాదు. అందునా పెద్ద ఫ్లాపు నుంచి పెద్ద హీరో సినిమా దొరకపుచ్చుకోవడం అంటే మరీనూ. ఇప్పుడు దర్శుకుడు సుకుమార్ ది అదే పరిస్థితి. వన్ సినిమా దెబ్బ ఇంతా అంతా కాదు. అది మరీ అంత ఫ్లాప్ కాకుండా వుంటే ఈ పాటికి ఎన్టీఆర్ తో సినిమా సెట్ పైకి చేరుకుని వుండేది. 

కానీ అలా జరగలేదు. అయినా సుకుమార్ ఆశ చంపుకోలేదు. లైన్ మీద లైన్ లు, కథల మీద కథలు ఎన్టీఆర్ కు చెబుతూనే వున్నాడని టాక్. అయితే అదేమంత నిజం కాదనీ, అసలు సుకుమార్ ను ఎన్టీఆర్ ఎప్పుడో పక్కన పెట్టేసాడని, లైను లేదు లెంగ్తూ లేదని హీరో సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

ఈ సంగతే కరెక్ట్ అనేలా వున్నాయి సుకుమార్ మాటలు. ఆర్య సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తే బాగుంటుందని అంటున్నాడట. అంటే ఇక టాలీవుడ్ పై ఆశలు వదిలేసుకున్నట్లా లేక, రచ్చగెలిచి, ఆపై ఇంటికి మళ్లీ వద్దామనా..? ఏమో?