‘నాన్సెన్స్‌.. నేనలాంటోడ్ని కాను..’

‘అర్థం పర్థంలేని విమర్శలు చేస్తోంది.. నేనేంటి.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమేంటి..’ అంటున్నాడు ప్రీతి జింటా మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్‌ వాడియా. నెస్‌ వాడియా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనీ, తనపై చెయ్యిచేసుకున్నాడనీ…

‘అర్థం పర్థంలేని విమర్శలు చేస్తోంది.. నేనేంటి.. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమేంటి..’ అంటున్నాడు ప్రీతి జింటా మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్‌ వాడియా. నెస్‌ వాడియా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనీ, తనపై చెయ్యిచేసుకున్నాడనీ ప్రీతి జింటా పోలీసులను ఆశ్రయించిన విషయం విదితమే. చెన్నయ్‌ ` పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నది ప్రీతి జింటా ఆరోపణ.

తనపై వచ్చిన ఆరోపణలపై నెస్‌ వాడియా మీడియాకి వివరణ ఇచ్చాడు. ‘బహుశా ఆమె పబ్లిసిటీ స్టంట్‌ చేస్తోందేమో. ఈ ఘటనతో ఆమెపై మిగిలిన కాస్త గౌరవం కూడా పోయింది.. నన్ను బజారుకీడ్చాలనుకుంటోన్న ఆమె తీరు అభ్యంతరకరం.. న్యాయస్థానంలోనే అన్నీ తేల్చుకుంటా..’ అన్నాడు నెస్‌ వాడియా, తనపై ప్రీతి చేసిన ఆరోపణలకు స్పందిస్తూ.

కాగా, ప్రీతి ఫిర్యాదుని పరిగణనలోకి తీసుకుంటామనీ, ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నామనీ కేసును విచారిస్తోన్న పోలీసులు వెల్లడిరచారు. మరోపక్క మహిళా సంఘాలు ప్రీతి జింటాకి బాసటగా నిలిచాయి. తక్షణం నెస్‌ వాడియాని అరెస్టు చేయాలంటూ ముంబైలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. మీడియా సైతం ఈ ఎపిసోడ్‌లో ప్రీతి జింటా వెంటే వుండడం గమనార్హం.