రిలయన్స్ కు కలిసొచ్చేనా ‘మనం’

రిలయన్స్ సంస్థ ఏ ముహుర్తాన తెలుగులో సినిమాలు తీయడం ప్రారంభించిందో కానీ, డిజాస్టర్సే అన్నీ. ఒక్క పవన్, అత్తారింటికి దారేది మాత్రమే దీనికి మినహాయింపు. పాపం ఆ సినిమా కూడా విడులకు ముందు చాలా…

రిలయన్స్ సంస్థ ఏ ముహుర్తాన తెలుగులో సినిమాలు తీయడం ప్రారంభించిందో కానీ, డిజాస్టర్సే అన్నీ. ఒక్క పవన్, అత్తారింటికి దారేది మాత్రమే దీనికి మినహాయింపు. పాపం ఆ సినిమా కూడా విడులకు ముందు చాలా కష్టాలు ఎదుర్కోంది. వైవిఎస్ చౌదరి-విష్ణు కాంబినేషన్ లో సలీం అంటూ తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు. అక్కడే బాంబు పేలింది. సినిమా ఢమాల్. ఆ తరువాత జెడి చక్రవర్తి మనీ మనీ మోర్ మనీ సినిమా పంపిణీలో చేతులు పెట్టారు. మసి. 

ఆ తరువాత బాలయ్య 'అధినాయకుడు' పంపిణీకి రెడీ అయ్యారు. ఆ సినిమా సంగతి చెప్పనవసరమే లేదు. ఆ తరువాత నిర్మాత బోగవిల్లి ప్రసాద్ తో చేతులు కలిపారు. రవితేజ-పూరి కాంబినేషన్ లో దేవుడు చేసిన మనుషులు అనే మహత్తర చిత్రం అందించారు. అబ్బో..మా చెడ్డ ఫెయిల్యూర్ అది. ఆ వెంటనే గోపీచంద్ తో సాహసం సినిమా తీసారు. అది మరీ ఫ్లాపు కాదు కానీ, లాభాలు కూడా లేవు. 

ఆ తరువాత అత్తారింటికిదారేది. అటు నిర్మాత భోగవల్లి ప్రసాద్ కు, ఇటు రిలయన్స్ కు విజయం అనేది ఒకటి వుంటుందని తెలియచెప్పిన సినిమా. మళ్లీ అంతలోనే నాగ్ తో ఒప్పందం కుదుర్చుకుని భాయ్ తీసారు. అది నాగ్ కు పీడకలగా మిగిలింది. ఇప్పటికీ అతగాడు దాన్ని తలుచుకోని రోజు లేదు. ఇక ఇప్పుడు తాజగా మనం. అదేమవుతుందో. మరో అత్తారింటికి దారేది లా లక్ గా మారుతుందో..లేదూ రిలయన్స్ గత సినిమాల బాటనే పడుతుందో?

అన్నట్లు ఇదే రిలయన్స్ కు తమిళంలో కూడా మహత్తర ఫ్లాపులున్నాయి. రావణన్, డేవిడ్ లాంటివి. అయితే బాలీవుడ్ లో మాత్రం ఆ సంస్థ బాగానే హిట్ లు కొడుతూంది. తెలుగునాట ఎందుకిలానో?