శర్వా సరసన కైరా

శర్వానంద్, యువి క్రియేషన్స్ ఇద్దరిదీ ఒకటే తరహా..కాస్త డిఫరెంట్ గా, మరి కాస్త స్టయిల్ గా వుండేలాంటి సినిమాలు చేయడం. రన్ రాజా రన్ తో ఈ కాంబినేషన్ క్లిక్ అయింది. ఇప్పుడు మరోసారి…

శర్వానంద్, యువి క్రియేషన్స్ ఇద్దరిదీ ఒకటే తరహా..కాస్త డిఫరెంట్ గా, మరి కాస్త స్టయిల్ గా వుండేలాంటి సినిమాలు చేయడం. రన్ రాజా రన్ తో ఈ కాంబినేషన్ క్లిక్ అయింది. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ సెట్ చేసి వుంచారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ ఇచ్చిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు. 

ఈ సినిమా శర్వానంద్ సరసన హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అన్న వేట ముగింపునకు వచ్చేసిందని టాక్..బాలీవుడ్ లో పగ్లీ సినిమా చేసిన కైరా అద్వానీని యూనిట్, హీరో, దర్ళకుడు కలసి ఓకె చేసారని అంటున్నారు. మొత్తానికి శర్వానంద్ ఎంపిక భలేగా వుంటుంది.