అల్లరి నరేష్ కు సంపూనే

అల్లరి నరేష్ కూడా ఆఖరికి సంపూర్ణేష్ బాబును తెచ్చుకున్నాడు. ఓ వీర కమెడియన్ మరో అప్ కమింగ్ కమెడియన్ పై ఆధారపడడం అంటే ఆలోచించాల్సిందే. సంపూర్ణేష్ బాబు ఇప్పుడు ఆటలో అరటిపండు, పేకాటలో తురుపు…

అల్లరి నరేష్ కూడా ఆఖరికి సంపూర్ణేష్ బాబును తెచ్చుకున్నాడు. ఓ వీర కమెడియన్ మరో అప్ కమింగ్ కమెడియన్ పై ఆధారపడడం అంటే ఆలోచించాల్సిందే. సంపూర్ణేష్ బాబు ఇప్పుడు ఆటలో అరటిపండు, పేకాటలో తురుపు ముక్కలా తయారయ్యారు. ఆయనను ఎక్కడో అక్కడ చూపించాలనుకుంటున్నారు. 

పెసరట్టు సినిమాలో కూడా సంపూ వున్నాడు. ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాలోనూ వున్నాడు. పైగా నరేష్ కు క్లాస్ కామెడీ నప్పమన్నా నప్పదు. బాఫు, వంశీ, విశ్వనాధ్ ట్రయ్ చేసి విఫలమయ్యారు. ఇప్పుడు ఇంద్రగంటి ఏం చేస్తారో చూడాలి. బహుశా అందుకే ముందుజాగ్రత్తతో కావచ్చు..సంపూను తోడు తెచ్చుకున్నారు. ఇదైనా వర్కవుట్ అయితే మంచిందే.