ప్చ్‌.. కూలిపోయింది

గాల్లోకి ఎగిరాక విమానం.. ఆచూకీ లేకుండా పోయిందంటే, ఆశలొదిలేసుకోవాల్సిందే. మనిషి ఆశాజీవి కదా, మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఆచూకీ తెలియకుండా పోయిందన్న వార్తలు రాగానే, ఎక్కడో ఓ చోట సేఫ్‌గా ల్యాండ్‌ అయి వుంటుందని…

గాల్లోకి ఎగిరాక విమానం.. ఆచూకీ లేకుండా పోయిందంటే, ఆశలొదిలేసుకోవాల్సిందే. మనిషి ఆశాజీవి కదా, మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఆచూకీ తెలియకుండా పోయిందన్న వార్తలు రాగానే, ఎక్కడో ఓ చోట సేఫ్‌గా ల్యాండ్‌ అయి వుంటుందని అనుకున్నాడు. ప్రపంచమంతా, ఆ విమాన ప్రయాణీకులు క్షేమంగా తిరిగిరావాలని ఆశించారు. కానీ, వారి ఆశలు నెరవేరలేదు.

విమానం కూలిపోయిందన్న నిర్ధారణకే 16 రోజుల సమయం పట్టింది. ఆస్ట్రేలియాకి దగ్గర్లో సముద్రంలో విమానం కూలిపోయినట్లు, మలేషియన్‌ ప్రధాని ఈ రోజు సాయంత్రం అధికారికంగా వెల్లడించారు. ఆస్ట్రేలియాకి చెందిన నౌక ఒకటి, విమాన శకలాల వద్దకు వెళ్ళి, తప్పిపోయిన విమానం తాలూకు శకలాలేనని తేల్చి చెప్పింది.

ఇక, విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తామంటోన్న మలేషియా ప్రధాని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రపంచంలోని వివిధ దేశాలు ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేశాయి.

మొత్తం 239 మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పైలట్‌, విమానాన్ని హైజాక్‌ చేశాడని ఇప్పటిదాకా ప్రచారం జరుగుతోంది. రేపు పూర్తి వివరాల్ని మలేషియా ప్రభుత్వం వెల్లడించేదాకా, విమానం ఎందుకు కూలిపోయిందన్నది సస్పెన్సే.