కన్యత్వాన్ని వేలానికి పెట్టిన మెడికల్ విద్యార్ధిని

రాను రానూ దేన్ని ఆదర్శంగా తీసుకోవాలో .. దేన్ని తీసుకోకూడదో కూడా తెలియడం లేదు కొంత మందికి. ఇదే కోవకు చెందుతుంది అమెరికన్ మెడికల్ విద్యార్థి ఎలిజబెత్ రెయిన్. 2009 లో తన శీలాన్ని…

రాను రానూ దేన్ని ఆదర్శంగా తీసుకోవాలో .. దేన్ని తీసుకోకూడదో కూడా తెలియడం లేదు కొంత మందికి. ఇదే కోవకు చెందుతుంది అమెరికన్ మెడికల్ విద్యార్థి ఎలిజబెత్ రెయిన్. 2009 లో తన శీలాన్ని వేలం పెట్టి 3.7 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన నటాలీ డీలాన్ ను ఆదర్శంగా తీసుకున్నాను అని చెబుతున్న ఈ అమ్మడు తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. ఒక వెబ్ సైట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వేలంలో గెలిచినవారితో 12 గంటల డేటింగ్, తర్వాత 'ఆ' తొలి అనుభవం అందిస్తానని ఈ అమ్మడు ప్రకటించింది.

తన అందచందాలను ఆరబోసేలా చిన్న వీడియో క్లిప్ ను తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి ప్రచారానికి తెరలేపింది రెయిన్. ఈ వీడియోలో తన ముఖాన్ని మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. ఇంతాచేసిన ఈమెను ఎవరైనా … వేశ్య అంటే మాత్రం ఒప్పుకోనని, అదికూడా ఒక వృత్తే అని.. తనను తాను వెనకేసుకుంటూ, వ్యభిచారులను, వేశ్యలను వెనకేసుకొచ్చే కార్యక్రమం తలపెట్టింది.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ.. ఈ కన్యత్వ వేలానికి తేదీ మాత్రం ఏప్రిల్ 1 గా ప్రకటించింది రెయిన్. ఈ తేదీ చూస్తుంటే మాత్రం ఒకింత సందేహం కలుగుతున్నా… చాలా మంది ఆశావహులు మాత్రం అప్పుడే వేలానికి సిద్ధమవుతున్నారు. 27 ఏళ్ల వయసు, 5.10 అడుగుల ఎత్తు, 59 కేజీల బరువు… అంటూ తన అంద చందాలపై ఆశలు రేపే పనిలో ఉంది రెయిన్.