ఈ నెలలో నాని సినిమాలు మూడొస్తున్నాయోచ్ అంటూ హడావుడి చేసింది మీడియా. ఆ దిష్టే నానీకి తగిలేసింది. శుక్రవారం విడుదలైన పైసా చెల్లుబాటు అయ్యేట్టు కనిపించడం లేదు. ఇక జండాపైకపిరాజు, అహా కల్యాణం రెండూ ఒకేరోజు ఢీకొట్టుకొనే ప్రమాదంలో పడ్డాయి. ఫిబ్రవరి 21న నేనంటే నేను… అంటూ ఇద్దరు నిర్మాతలూ పోటీ పడుతున్నారట.
దాంతో…చివరాఖరికి జెండాపైకపిరాజు పోటీ నుంచి తప్పుకొన్నాడు. అసలు ఈ సినిమా ఫిబ్రవరిలోనే రావడం లేదని టాక్. మార్చికి వెళ్లిపోయిందని సమాచరమ్. మరోవైపు నాని పైసాని వదిలేసి ఆహా కల్యాణంవైపు పరుగులు తీస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం చెన్నైలోనే మకాం వేశాడు. పైసా సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోయిందేమో, చెన్నైవెళ్లిపోయాడు అని జోకులేసుకొంటున్నారు ఇక్కడివాళ్లు.