‘తొలిప్రేమ’ నుంచి ‘ఖుషీ’ వరకు తన సినిమాలు అన్నిట్లో పవన్‌కళ్యాణ్ క్రియేటివ్‌గా ఇన్‌వాల్వ్ అయ్యాడు. బద్రి సినిమాలో స్వయంగా ఫైట్లు కంపోజ్ చేసుకున్నాడు. ఖుషీలో అయితే పాటలు, ఫైట్ల కాన్సెప్టులు పవన్‌వే. యూత్ పల్స్ పట్టేశాడని, పవన్‌కి ఎదురు లేదని అనుకున్నారు. అదే జోరులో ‘జానీ’ సినిమాకి దర్శకత్వం వహించాడు. అంతవరకు యూత్‌ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన పవన్ ఆ సినిమాలో పూర్తిగా వేరే కోణంలో కనిపించి ఫ్లాప్ అయ్యాడు.
ఆ తర్వాత ‘గుడుంబా శంకర్’ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు పాటల చిత్రీకరణ, ఫైట్స్ కంపోజింగ్ చేశాడు. ఆ సినిమాలో అతి శృతి మించడం వల్ల పరాజయం చవిచూడాల్సి వచ్చింది. దాంతో పవన్ ఇక తన క్రియేటివ్ ఆలోచనల్ని కట్టిపెట్టి పూర్తిగా దర్శకులకి ఫ్రీడమ్ ఇచ్చాడు. తనకి ఎలాంటి కథలు కావాలనేది అడిగేవాడే కానీ క్రియేటివ్ సైడ్ ఇంటర్‌ఫియర్ కాలేదు. అన్నవరంలో ఒక పాట, తీన్‌మార్‌లో ఒక ఫైట్ తప్ప పవన్ ఇక దేంట్లోను వేలు పెట్టలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు పవన్ పూర్తిగా ఇన్‌వాల్వ్ అయి చేస్తున్న సినిమా ‘గబ్బర్‌సింగ్ 2’. ఈ చిత్రానికి మూల కథ అందించిన పవన్ స్క్రిప్ట్ వర్క్ మొత్తంలో ఇన్‌వాల్వ్ అయ్యాడట. ఈ సినిమాకి సంబంధించినంత వరకు పవన్ అన్ని సైడ్స్ ఇన్‌వాల్వ్ అవుతున్నాడని టాక్. ఇప్పుడు ఇంకో ఖుషీనే అందిస్తాడో లేక మరో గుడుంబా కాస్తాడో అనేది వేచి చూడాల్సిందే.