ఓహ్ గాడ్‌.. ఇంకో అట్టర్‌ఫ్లాప్‌!

సూర్య తమ్ముడు కార్తీని వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. హ్యాట్రిక్‌ హిట్స్‌ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్‌ రాజేష్‌ కూడా కార్తీ ఫ్లాపులకి అడ్డుకట్ట వేయలేకపోయాడు. దీపావళికి విడుదలైన కార్తీ సినిమా ‘ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా’…

సూర్య తమ్ముడు కార్తీని వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. హ్యాట్రిక్‌ హిట్స్‌ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్‌ రాజేష్‌ కూడా కార్తీ ఫ్లాపులకి అడ్డుకట్ట వేయలేకపోయాడు. దీపావళికి విడుదలైన కార్తీ సినిమా ‘ఆల్‌ ఇన్‌ ఆల్‌ అళగురాజా’ దారుణమైన టాక్‌ తెచ్చుకుంది. ‘అలెక్స్‌ పాండ్యన్‌’ (బ్యాడ్‌బాయ్‌) చిత్రంతో అట్టర్‌ఫ్లాప్‌ చవిచూసిన కార్తీకి ఇప్పుడీ సినిమాతో మరో ఎదురుదెబ్బ తగిలింది. 

హీరోగా అద్భుతమైన ఆరంభం అందుకున్న కార్తీ వరుసగా నాలుగైదు విజయాలు సాధించాడు. అయితే ఆ తర్వాత అతను కథల ఎంపికలో పొరపాట్లు చేస్తూ ఫ్లాపుల ఊబిలో కూరుకుపోతున్నాడు. మరోవైపు తన అన్న సూర్య అటు క్లాస్‌, ఇటు మాస్‌… అందరినీ కవర్‌ చేస్తూ హిట్స్‌ కొడుతున్నాడు. కానీ కార్తీకి మాత్రం ఇంకా ఆ బ్యాలెన్స్‌ దొరకట్లేదు. 

తెలుగులో కూడా మార్కెట్‌ సంపాదించిన కార్తీ వరుస ఫ్లాప్స్‌ కారణంగా ఇక్కడ కూడా క్రేజ్‌ కోల్పోతున్నాడు. ఘనమైన సినీ నేపథ్యమున్నా, విశ్వాసం గల కోటరీ ఉన్నా కానీ కార్తీ చేతికి హిట్‌ కథలు వెళ్లడం లేదు. బహుశా కెరీర్‌ మొదట్లో చేసిన ప్రయోగాల్లాంటివి మరోసారి ప్రయత్నించి చూడాల్సిన తరుణం వచ్చేసిందేమో.