‘రెడీ’ తర్వాత చాలా కాలానికి ‘కందిరీగ’తో హిట్ కొట్టిన రామ్‌కి ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్లాంటి హిట్స్ ఇచ్చిన కరుణాకరన్ తన తదుపరి చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’తో రామ్ ఆశలకి మంట పెట్టాడు. ఆ సినిమా ఫ్లాప్ నుంచి కోలుకోక ముందే ‘ఒంగోలు గిత్త’ కొమ్ములకి చిక్కాడు.
ఆ రెండు పరాజయాల నుంచి కోలుకోవడానికి రామ్ ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి నటించిన ‘మసాలా’తో వస్తున్నాడు. హిందీలో హిట్ అయిన ‘బోల్ బచ్చన్’కి రీమేక్ అయిన ‘మసాలా’కి విజయభాస్కర్ దర్శకత్వం వహించాడు. గతంలో త్రివిక్రమ్ రచన అందించిన సినిమాల్తో ఘన విజయాలు సాధించిన విజయభాస్కర్ ఆ తర్వాత బాగా డౌన్ అయ్యాడు. అయితే రామ్, వెంకటేష్ కాంబినేషన్‌తో పాటు కామెడీ సినిమా అనే స్టాంప్ ‘మసాలా’పై అంచనాలు పెంచుతోంది.
ఈ మసాలాలో ఘాటు బాగుంటుందని, తప్పకుండా తనని ఫ్లాపుల బారినుంచి బయటపడేసి గట్టెక్కిస్తుందని రామ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకే తదుపరి సినిమా ఏంటనేది కూడా అతను ఇంకా నిర్ణయించుకోలేదు. మసాలా రిజల్ట్‌ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాడు.