ఫలానా సినిమా చేయాలని ఎప్పుడూ అనుకోను. వచ్చిన సినిమా చేస్తూ పోవడమే… అంటుంటాడు వెంకటేష్. నిజానికి ఆయనకూ ఓ కలల సినిమా ఉంది. అదే… వివేకానంద. ఆ మహనీయుడి బోధనలనూ, జీవితాన్ని వెండి తెరపై చూపించాలని, అందులో తాను నటించాలనేది వెంకీ ఆశ.
వీలైతే ఈ కథను ధారావాహికగా తీయాలని కూడా అనుకొన్నాడు. ఇందుకు సంబంధించి కొంతమంది దర్శకులతో చర్చలు కూడా జరిపాడు. ఒక దశలో నీలకంఠ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ సినిమాని మేం చేయలేం… అని దర్శకులు చేతులు ఎత్తేస్తున్నారట.
దాంతో వెంకీ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలవ్వకుండానే అటకెక్కేసినట్టు అయ్యింది. “నాకైతే వివేకానంద సినిమా చేయాలని ఉంది. ఎవరైనా ఈ బాధ్యత భుజాన ఎత్తుకొంటానంటే నటించడానికి నాకు అభ్యంతరం లేదు” అంటున్నాడు వెంకీ. మరి దర్శకులు అంతకు తయ్యారేనా..?