కె.విజయభాస్కర్ – త్రివిక్రమ్…. ఈ జోడీ సృష్టించిన అద్భుతాలకు లెక్కేలేదు. స్వయం వరం నుంచి మొదలై…నువ్వేకావాలి, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరీ – ఇలా అన్నీ సూపర్ హిట్సే. త్రివిక్రమ్ కలం బలం వల్ల ఆ సినిమాలు అంతలా ఆడాయో, లేదంటే విజయ భాస్కర్ అంతలా రాబట్టుకొన్నాడో తెలీదు గానీ.. ఒకానొక దశలో వీరిద్దరూ సూపర్ జోడీగా పేరు తెచ్చుకొన్నారు. అయితే ఆ తరవాత వీరిద్దరి బంధానికీ బ్రేకులు పడ్డాయి. ఎప్పుడైతే త్రివిక్రమ్ బయటకు వచ్చేశాడో, అప్పుడు విజయ భాస్కర్‌కి విజయాలు దూరమయ్యాయి. అసలు వీరిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏమిటి?? అసలేం జరిగింది??
నిజానికి వీరిద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణం జై చిరంజీవ సినిమా అట. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. విజయభాస్కర్ – త్రివిక్రమ్‌లు పనిచేసిన చివరి చిత్రం ఇదే. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం విజయభాస్కర్‌కి తీవ్రమైన మనోవేదన కలిగించింది. త్రివిక్రమ్ ఈ సినిమాకి మనసు పెట్టి పనిచేయలనేదనేది విజయభాస్కర్ ఫీలింగ్. అదే విషయం త్రివిక్రమ్‌తో చెప్పేశాడు విజయభాస్కర్. దాంతో త్రివిక్రమ్ మనసు నొచ్చుకొంది. దానికి తోడు త్రివిక్రమ్ కూడా అప్పటికి నువ్వే నువ్వేతో దర్శకుడుగా మారిపోయాడు. ఏదో విజయభాస్కర్ బలవంతంపై జై చిరంజీవ సినిమాకి పనిచేశాడంతే. దాంతో… ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. ఇక మీదట కలసి పనిచేయకూడదని అప్పుడే నిర్ణయానికి వచ్చేశారట. అదీ ఈ ఇద్దరి మధ్య అడ్డు గోడలు పుట్టడానికి అసలు కారణం.