బాహుబలి పార్ట్‌ 2 వచ్చేస్తోంది

ఫస్ట్‌ పార్ట్‌ 2015లో అంటున్నారు. ఇక రెండో పార్ట్‌ ఇప్పుడే ఎక్కడ వస్తుంది? అనుకొంటున్నారా?  మేం చెప్పేది సినిమా గురించి కాదు.. టీజర్‌ గురించి. ప్రభాస్‌ పుట్టిన రోజున బాహుబలి మేకింగ్‌ టీజర్‌ ని…

ఫస్ట్‌ పార్ట్‌ 2015లో అంటున్నారు. ఇక రెండో పార్ట్‌ ఇప్పుడే ఎక్కడ వస్తుంది? అనుకొంటున్నారా?  మేం చెప్పేది సినిమా గురించి కాదు.. టీజర్‌ గురించి. ప్రభాస్‌ పుట్టిన రోజున బాహుబలి మేకింగ్‌ టీజర్‌ ని విడుదల చేశారు. ఆ టీజర్‌ కి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు కాపీ అనే ముద్ర కూడా పడింది. 

అందుకే ఇప్పుడు రాజమౌళి తన సొంత ముద్ర చూపించాలని భావిస్తున్నాడట. అతి త్వరలో రెండో టీజర్‌ని తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనికి సంబంధించి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్‌ చేశారు. బాహుబలి స్వీట్‌ వీడియో విడుదల చేస్తున్నాం… అని చెప్పారాయన. స్వీట్‌ వీడియో.. అన్నారంటే – రాజమౌళి ఏదో ప్రత్యేకత చూపించబోతున్నాడన్నమాట. మరి ఈ రెండో టీజర్‌ లో ఏముందో మరి..?