అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తోన్న ‘రుద్రమదేవి’ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ‘ది వారియర్ క్వీన్’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘రుద్రమదేవి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. రేపు అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘రుద్రమదేవి’ సినిమాలో రాణా ఓ కీలక పాత్ర పోషిస్తోన్న విషయం విదితమే. ‘ఇద్దరమ్మాయిలతో’ ఫేం కేథరీన్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
త్రీడీ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ సినిమా, తెలుగు తెరపైనే కాక, ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఓ ప్రయోగాత్మక చిత్రమవుతుందన్నది దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ నమ్మకం. ‘అరుంధతి’ తర్వాత ఆ తరహా సినిమాలు ఒకటీ అరా అనుష్క చేసినప్పటికీ, ‘రుద్రమదేవి’ సినిమా ‘అరుంధతి’తో తలపడేలా వుంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చూస్తే అర్థమవుతోంది.
సుమారు 50 కోట్ల రూపాయలతో ‘రుద్రమదేవి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.