మిగతావారందరికీ పవన్ కల్యాణ్ ఓ సెంటింమెంట్ గా తయారైతే, పవన్ కల్యాణ్ కి దేవిశ్రీ ప్రసాద్ సెంటిముంట్‌గా మారిపోయాడు. అవును.. పనవ్ ఇప్పుడు దేవి పాటే పడుతున్నాడు. రికార్డులు కూడా దేవికి వత్తాసు పలుకుతున్నాయి. ఖుషీ తరవాత ఓ నికార్సయిన హిట్ కోసం పవన్ తపిస్తున్నప్పుడు జల్సా వచ్చింది. ఆ సినిమా కోసం తొలిసారి వవన్ తో పనిచేశాడు దేవీశ్రీ. ఆ సినిమా హిట్. ఆ తరవాత గబ్బర్ సింగ్ కొత్త రికార్డులు సృష్టించింది. ఆ సినిమాకీ దేవి పాటలు బాగా ప్లస్ అయ్యాయి. పాటల కోసం మళ్లీ మళ్లీ ఆ సినిమాకి వెళ్లిన వాళ్లు ఎంతమందో..?
పవన్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ఆడియో హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అత్తారింటికి దారేది దానికి మించిన సందడినీ, రికార్డులను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకీ దేవీనే పెద్ద ప్లస్ అయ్యాడు. అత్తారింటికి దారేదితో పవన్ – దేవిశ్రీల కాంబినేషన్ సూపర్ హ్యాట్రిక్ కొట్టేసింది. అందుకే వపన్ కూడా తన తరవాతి సినిమాకి దేవిశ్రీనే కోరుకొంటున్నాడట.
పవన్ నటిస్తున్న తాజా చిత్రం గబ్బర్ సింగ్ 2. ఈనెలాఖరున ఈసినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ఇంకా ప్రకటించలేదు గానీ.. ఇందులోదేవి పేరు ఖాయమైపోయింది. ఈ సినిమాలో ఎవరున్నా లేకున్నా డీఎస్ పీ ఉండాలని పవన్ చెబుతున్నాడట. పవన్ చెప్పాడంటే ఇక తిరుగేముంది..? రెండో హ్యాట్రిక్ కి గబ్బర్ సింగ్ 2తో శ్రీకారం చుట్టేస్తారేమో..?